సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. వైఎస్ జగన్‌పై హత్యాయత్నంపై దాఖలు అయిన అన్ని పిటిషన్లను సోమవారం విచారిస్తామని ధర్మానం ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం ఆజమాయిషీ లేని థర్డ్ పార్టీ చేత దర్యాప్తు జరిపించాలని పిటిషన్‌లో వైఎస్ జగన్ కోరిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. సోమవారం కల్లా అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
మరోవైపు వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో హైకోర్టులో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఏపీ పోలీస్ పరిధి నుండి కేసును సీఐఎస్ఎఫ్‌కు బదిలీ చేసి, జాతీయ దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలని కోరారు. కేంద్ర హోంమంత్రిత్వ కార్యదర్శి, పౌర విమానయాన కార్యదర్శి, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎన్‌ఐఏ డైరెక్టర్ జనరల్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ డీజీపీ, విశాఖ తూర్పు డివిజన్ పోలీసు అసిస్టెంట్ కమిషనర్, వైజాగ్ పోలీసు కమిషనర్, విశాఖ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్ హౌస్ ఆఫీసర్‌లను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిల్‌పై విచారణను కూడా హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment