న్యాయమూర్తులకు ఎవరి సర్టిఫికెట్లు అవసరంలేదని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించిం
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకత కోసం ఓ సంస్థను ఏర్పాటు చేయాలంటూ జాతీయ న్యాయవాదుల సంఘం వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులకు ఎవరి సర్టిఫికెట్లు అవసరంలేదని జస్టిస్ ఏకే మిశ్రా, జస్టిస్ లలిత్‌ల ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.
సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకంలో బంధుప్రీతి చోటుచేసుకుటోందన్న జాతీయ న్యాయవాదుల సంఘం చేసిన వాదనలతో ధర్మాసనం విభేదించింది. ప్రతిభ కలిగిన వారికి కొలీజియం అన్యాయం చేసిందన్న వాదనలు అవాస్తవమంటూ పిటిషన్‌ను కొట్టేసింది.