ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధం: హైకోర్టు
రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్టవిరుద్ధమని హైకోర్టు తేల్చిచెప్పింది. కార్మికులు వెంటనే విధుల్లోకి చేరాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది.
ఆర్టీసీ సమ్మెను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలంటూ టీడీపీ నేత సీఎల్ వెంకట్రావు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే, సమ్మెపై ఓ కమిటీ ఏర్పాటు చేయాలంటూ చిత్తూరు జిల్లాకు చెందిన మహమూద్ గౌస్ కూడా పిటిషన్ దాఖలు చేశారు.