రోజా సస్పెన్షన్పై హైకోర్టులో పిల్
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను అసెంబ్లీ నుంచి ప్రభుత్వం అక్రమంగా ఏడాదిపాటు సస్పెండ్ చేసిన విషయంపై సోమవారం హైకోర్టులో పిల్ దాఖలైంది. హైకోర్టు ఆదేశాలను సైతం ప్రభుత్వం బేఖాతరు చేయడంపై పిల్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, స్పీకర్పై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దీనిపై హైకోర్టు మంగళవారం విచారణ జరపనున్నట్లు సమాచారం.
హైకోర్టు ఆదేశాలతో అసెంబ్లీకి వెళ్లిన రోజాను ప్రభుత్వం అడ్డుకున్న విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరించడం పట్ల పలువురు న్యాయ నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.