'సరి-బేసి'ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్ | PIL claims odd-even misdirected, HC seeks Centre, LG reply | Sakshi
Sakshi News home page

'సరి-బేసి'ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్

Published Fri, Feb 12 2016 4:50 PM | Last Updated on Sun, Sep 3 2017 5:31 PM

'సరి-బేసి'ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్

'సరి-బేసి'ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించేందుకు తలపెట్టిన సరి-బేసి వాహన విధానాన్ని సవాల్‌ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. 1988నాటి మోటారు వాహనం చట్టాన్ని సరిగ్గా అమలుచేయకుండా, కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలపై ఈ చట్టం కింద కఠిన చర్యలు చేపట్టకుండా.. అందుకు బదులుగా కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే 'సరి-బేసి' విధానాన్ని ప్రభుత్వం అమలుచేస్తున్నదని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

 ఢిల్లీ ప్రభుత్వం గతంలో 15 రోజులపాటు సరి-బేసి విధానాన్ని అమలుచేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో కాలుష్య పరీక్షలు ఒక ప్రహసనంగా మారిపోయాయని, ప్రభుత్వానికి, ప్రభుత్వ ఏజెన్సీలకు సంబంధం లేకుండానే వాహనాలకు పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్లు జారీచేస్తున్నారని ఈ పిల్ దాఖలు చేసిన స్వచ్ఛంద సంస్థ హైకోర్టుకు నివేదించింది. దీనిపై  చీఫ్ జస్టీస్ జీ రోహిణి, జస్టీస్ జయంత్‌తో కూడిన ధర్మాసనం స్పందిస్తూ మార్చి 30 లోపు వివరణ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్న్‌కు నోటిసులు ఇచ్చింది. సరి-బేసి విధానాన్ని ఏప్రిల్ 15 నుంచి 30 వరకు మరోసారి అమలుచేయనున్నట్లు సీఎం క్రేజీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement