odd-even
-
అక్కడ సరి, బేసి విధానంలో పాఠశాలలు
గువహటి: కరోనా మహమ్మారి కారణంగా ఏడు నెలలుగా మూత పడిని స్కూళ్లు, కాలేజీలు తిరిగి ప్రారంభమయ్యాయి. అన్‌లాక్ 5.0 నిబంధనల్లో భాగంగా అసోంలో ఈరోజు నుంచి విద్యా సంస్థలను తెరిచారు. ఆరు నుంచి 12వ తరగతి విద్యార్థులకు సరి, బేసి విధానంలో పాఠాలు మొదలపెట్టారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే తరగతులు నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. సరి, బేసి విధానంలో తరగతులు పెట్టడం వల్ల కొవిడ్-19 వ్యాపించకుండా చేయొచ్చన్నారు. 6, 8, 12 తరగతులు సోమ, బుధ, శుక్ర వారాల్లో నిర్వహిస్తారు. మిగిలిన రోజుల్లో 7, 9,11 తరగతులు జరుగుతాయి. తరగతులు జరిగే రోజుల్లో విద్యార్థులంతా ఒకేసారి రాకుండా గ్రూపులుగా విభజించనున్నారు. కొన్ని గ్రూపులకు ఉదయం మరికొన్ని గ్రూపులకు మధ్యాహ్నం పాఠాలు చెప్పనున్నారు. ఎవరు ఎప్పుడు వస్తారనేది ఆయా పాఠశాలలు, కాలేజీల యాజమాన్యం నిర్ణయిస్తుందని అధికారులు తెలిపారు. ఉదయం తరగతులు 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. మధ్యాహ్న తరగతులు 12.30 నుంచి సాయంత్రం 3.30 వరకు జరుగుతాయి. -
అక్షత్.. మరో అద్భుతం...!
న్యూఢిల్లీః ఆడ్ ఈవెన్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు అక్షత్ మిట్టల్ గుర్తున్నాడా? దేశ రాజధాని నగరంలో కాలుష్య నివారణకోసం కేజ్రీవాల్ సర్కారు ప్రవేశ పెట్టిన సరి బేసి వాహన విధానంతో 13 ఏళ్ళ వయసులోనే తన ప్రతిభతో వెలుగులోకి వచ్చిన అక్షత్.. అందర్నీ ఆకట్టుకున్నాడు. ఢిల్లీ నగరంలో సరి బేసితో ఇబ్బందులు పడుతున్న పౌరులను కష్టాలనుంచీ గట్టెక్కించేందుకు 'ఆడ్ ఈవెన్ డాట్ కామ్' పేరుతో ఓ వైబ్ సైట్ ను రూపొందించి అనూహ్యంగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు కార్ పూలింగ్ యాప్ ఓరాహీతో కలసి... ఆ బాల మేధావి.. మరో కొత్త యాప్ ను సృష్టించాడు. అక్షత్.. 13 ఏళ్ళ వయసులోనే తన సృజనాత్మకతతో అందరికీ చేరువయ్యాడు. వాహనదారులు తన వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేసుకుంటే.. సరి బేసి సమయాల్లో దగ్గరలోని వాహనదారులతో మాట్లాడి, వారి కార్లలో కార్యాలయాలకు సులభంగా చేరుకునే మార్గాన్ని ఆడ్ ఈవెన్ డాట్ కామ్ ద్వారా అందుబాటులోకి తెచ్చాడు. అయితే ఢిల్లీ ప్రభుత్వం కార్ పూలింగ్ విధానానికి బ్రేక్ వేయడం, అనంతరం తన వెబ్ సైట్ ను ఇతర సంస్థకు అమ్మేసిన అక్షత్.. ఇప్పుడు మరో యాప్ తో ప్రజల ముందుకొచ్చాడు. 15 ఏళ్ళ వయసున్న అక్షత్ మిట్టల్.. ప్రజల రోజువారీ సమస్యలను పరిష్కరించేందకు 'ఛేంజ్ మై ఇండియా డాట్ ఆర్గ్' పేరున కొత్త వెంచర్ ను బుధవారం ఆవిష్కరించాడు. ఆడ్ ఈవెన్ డాట్ కామ్ ను స్వాధీన పరచుకున్న గుర్గావ్ ఆధారిత సాంకేతిక, డొమైన్ నిపుణులు.. కార్ పూలింగ్ యాప్ 'ఓరాహీ' సలహా బోర్డు తో కలసి కొత్త యాప్ ను ప్రవేశ పెట్టాడు. దైనందిన జీవితంలో భారత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరించేందుకు అక్షత్ కొత్త యాప్.. ఛేంజ్ మై ఇండియా డాట్ ఆర్గ్.. పని చేయనుంది. భారత్ లో సామాజిక మార్పుకోసం, ప్రజలకు సహాయం అందించే దిశగా తాను ఆలోచిస్తున్న సమయంలోనే తనను... ఆడ్ ఈవెన్ డాట్ కామ్... అశోకా యూత్ ఛేంజ్ మేకర్ గా ఎంపిక చేసిందని అక్షత్ తెలిపాడు. సమాజంలో మార్పును కోరుకునేవారు, అందుకు సహాయం అందించే ఆసక్తి ఉన్నవారితో కలసి, దాదాపు పదిలక్షలమంది సమస్యలను పరిష్కరించే దిశగా ఈ ప్రస్తుత మిషన్ పనిచేస్తుందని అక్షత్ పేర్కొన్నాడు. ఇందులో భాగంగానే ప్రజలకు సహాయం అందించేందుకు ఛేంజ్ మై ఇండియా ప్రారంభించినట్లు అక్షత్ మిట్టల్ తెలిపాడు. -
'ఆడ్ ఈవెన్' ఎత్తుకు పై ఎత్తు!
నోయిడాః ఢిల్లీలో ప్రవేశ పెట్టిన 'ఆడ్ ఈవెన్ స్కీమ్' ఆటో మేకర్స్ కు కలసి వచ్చింది. నోయిడా ఆర్టీవో లెక్కలను బట్టి చూస్తే సరి బేసి పద్ధతిని ప్రవేశ పెట్టిన జనవరి, ఏప్రిల్ మధ్య కాలంలో ప్రైవేటు వాహనాల రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. వాహనం లేనిదే ప్రయాణం చేయలేని వినియోగదారులు ఆడ్ ఈవెన్ పద్ధతిని అధిగమించేందుకు ఏకంగా కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకూ వెనుకాడటం లేదు. ఢిల్లీలో అమల్లోకి తెచ్చిన సరి బేసి పథకం సమస్య నుంచి బయట పడేందుకు నగరవాసులు కొత్వ వాహనాల కొనుగోళ్ళు చేపడుతున్నారు. నోయిడా వంటి ప్రాంతాల్లో నివసిస్తూ ఢిల్లీ, గుర్గాంవ్ లో ఉద్యోగాలకు, పనులకు వెళ్ళాల్సిన ప్రజలు... అత్యధిక దూరం ప్రయాణించాల్సి రావడంతో సిస్టమ్ ను అధిగమించే మరో మార్గం లేక వాహనాల కొనుగోళ్ళకు సిద్ధపడుతున్నారు. ఒక్క జనవరి నెలలోనే నోయిడాలో 1,887 ద్విచక్ర వాహనాలు రిజిస్టర్ అవ్వడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇది డిసెంబర్ లోని 1,614 రిజిస్ట్రేషన్లతో పోలిస్తే సుమారు 17 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి, మార్చిల్లో కొంత శాతం తగ్గినా తిరిగి ఏప్రిల్ లో అత్యధిక రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే కేవలం సరి బేసి పథకం అమలు కాని నెలల్లో అత్యధిక కొనుగోళ్ళు జరిగినట్లు తెలుస్తోంది. మొదటి పది రోజుల్లో పెద్దగా రిజిస్ట్రేషన్లు లేకపోయినా ఏప్రిల్ 15 నుంచి 'ఆడ్ ఈవెన్' పద్ధతి అమల్లోకొస్తుందని తెలియడంతో నోయిడా ఆర్టీవో పరిథిలో ఏకంగా 712 కార్లు రిజిస్టర్ అవ్వడం పరిస్థితిని అవగతం చేస్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఏప్రిల్ నెలాఖరు నాటికి 2,136 కార్ల వరకూ... అంటే సుమారు 36 శాతం రిజిస్టర్ అయ్యే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. సరి బేసి పద్ధతి అమల్లోకి వచ్చిన తర్వాత డిసెంబర్ లో 3,676 గా ఉన్న ద్విచక్రవాహనాలు సహా ప్రైవేటు వాహనాల కొనుగోళ్ళు జనవరి నాటికి 5,237 కు పెరిగాయని దీన్ని బట్టి 42 శాతం రిజిస్ట్రేషన్లు పెరిగినట్లు తెలుస్తోందని అధికారులు వెల్లడించారు. -
ఊబర్, ఓలా సర్వీసులపై కఠిన చర్యలు
ఢిల్లీ: ఓలా, ఊబర్ ట్యాక్సీ సర్వీసులపై ఢిల్లీ ప్రభుత్వం కన్నెర్రజేసింది. దేశ రాజధానిలో సరి-బేసి విధానం అమలు చేస్తున్న సమయంలో తమ రేట్లను మూడునుంచి ఐదు రెట్లకు పెంచి ప్రయాణీకుల జేబులు కొల్లగొడుతున్న ఈ ట్యాక్సీ సర్వీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు. ట్యాక్సీ సర్వీసులు విమాన ప్రయాణపు చార్జీలను తమ నుంచి వసూలు చేస్తున్నాయని ప్రయాణీకులు వాపోతున్నారు. మామూలు సమయంలో మూడు రెట్లు, రద్దీ సమయంలో ఐదు రెట్లు చార్జీలు వసూలు చేస్తున్నారని వారు పేర్కొన్నారు. 'గతంలో నేను ఇంటి నుంచి అఫీసుకు వెళ్లడానికి రూ.400 అయ్యేది. ఇప్పుడు ఏకంగా రూ.2100 అవుతోంది' అని వసంత్ కుంజ్ కు చెందిన పునీత్ గులాటి వాపోయారు. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. తమ ప్రభుత్వ సరి-బేసి విధానాన్ని పాజిటివ్ గా అమలు చేస్తోందని అన్నారు. ప్రభుత్వ రేట్లకు మించి అధికంగా రేట్లను వసూలు చేసే టాక్సీల లైసెన్సులను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. చేంజ్ ఆర్గనైజేషన్ సభ్యులు పెరిగిన టాక్సీ ధరలకు వ్యతిరేకంగా వెయ్యి మంది సంతకాలతో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఊబర్, ఓలా సర్వీసులపై అమన్ గార్గ్ కోర్టులో కేసును నమోదు చేశారు. గతంలో బెంగళూరులో ట్యాక్సీ రేట్ల పెంపుకు వ్యతిరేకంగా అమన్ కేసు వేశారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కితీసుకుంది. -
ఢిల్లీలో బీజేపీని పక్కన పెట్టారు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ పై మరోమారు ఫైర్ అయ్యారు. సరి, బేసి నియమాన్ని పాటించవొద్దని బీజేపీ ప్రచారం చేసింది, కానీ ఢిల్లీలో ప్రజలు బీజేపీనే పక్కన పెట్టారని కేజ్రీవాల్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. గత జనవరిలో కూడా అధికారులతో సరి, బేసి నియమానికి వ్యతిరేకంగా బీజేపీ ధర్నాలు చేపించిందని మండిపడ్డారు. సరి, బేసీ విధానానికి వ్యతిరేకంగా బీజేపీకి చెందిన ఆటో యూనియన్ ధర్నాలకు పిలుపునిచ్చిందని గుర్తుచేశారు. ఈ విధానాన్ని కనుమరుగు చేయాలని చూస్తే ఢిల్లీ ప్రజలు బీజేపీనే పక్కన పెట్టి సరి- బేసీ విధానాన్ని విజయవంతం చేశారని పేర్కొన్నారు. ఢిల్లీలో మరోమారు సరి, బేసి నియమం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. నగర రోడ్లపై వాహన రద్దీని, కాలుష్యాన్ని నియంత్రించే ఉద్దేశంతో అమలుచేస్తున్న ఈ నియమం ప్రకారం శుక్రవారం నుంచి సరి నంబరు ప్లేటున్న కార్లు సరి తేదీల్లో, బేసి నంబరున్న కార్లు బేసి తేదీల్లో రోడ్లపైకి రావలసి ఉంటుంది. సీఎన్జీ స్టిక్కరు కలిగిన వాహనాలు, బ్యాటరీ హైబ్రిడ్ వాహనాలు, ఒంటరి మహిళలు నడిపే వాహనాలు, యూనిఫామ్ ధరించిన స్కూలు పిల్లలున్న కార్లు, వికలాంగుల కార్లు, ద్విచక్రవాహనాలకు ఈ నియమం నుంచి మినహాయింపునిచ్చారు. ఇలా ఉండగా శుక్ర, శనివారాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినాలు కావడం, ఆదివారం దీనికి మినహాయింపు ఉండడం వల్ల సోమవారం నుంచే అసలు పరీక్ష ప్రారంభం కానుంది. ప్రభుత్వం మాత్రం రెండో దశను కూడా విజయవంతంగా అమలుచేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. స్కూలు విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు స్కూలు బస్సులకు కోత విధించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలిగే అవకాశముంది. -
'సరి-బేసి'ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించేందుకు తలపెట్టిన సరి-బేసి వాహన విధానాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. 1988నాటి మోటారు వాహనం చట్టాన్ని సరిగ్గా అమలుచేయకుండా, కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలపై ఈ చట్టం కింద కఠిన చర్యలు చేపట్టకుండా.. అందుకు బదులుగా కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే 'సరి-బేసి' విధానాన్ని ప్రభుత్వం అమలుచేస్తున్నదని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఢిల్లీ ప్రభుత్వం గతంలో 15 రోజులపాటు సరి-బేసి విధానాన్ని అమలుచేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో కాలుష్య పరీక్షలు ఒక ప్రహసనంగా మారిపోయాయని, ప్రభుత్వానికి, ప్రభుత్వ ఏజెన్సీలకు సంబంధం లేకుండానే వాహనాలకు పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్లు జారీచేస్తున్నారని ఈ పిల్ దాఖలు చేసిన స్వచ్ఛంద సంస్థ హైకోర్టుకు నివేదించింది. దీనిపై చీఫ్ జస్టీస్ జీ రోహిణి, జస్టీస్ జయంత్‌తో కూడిన ధర్మాసనం స్పందిస్తూ మార్చి 30 లోపు వివరణ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్న్‌కు నోటిసులు ఇచ్చింది. సరి-బేసి విధానాన్ని ఏప్రిల్ 15 నుంచి 30 వరకు మరోసారి అమలుచేయనున్నట్లు సీఎం క్రేజీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
‘సరి-బేసి’ సాధించింది ఏమిటి?
తగ్గిన వాహనాల రద్దీ కాలుష్యంలో తగ్గింపుపై అస్పష్టత న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యానికి కళ్లెం వేయడానికి సీఎం అరవింద్ కేజ్రీవాల్ సర్కారు తీసుకొచ్చిన ‘సరి-బేసి’ విధానాన్ని ఈ నెల 1 నుంచి 15వరకు ప్రయోగపూర్వకంగా అమలు చేశారు. సరి, బేసి సంఖ్యలున్న నాలుగు చక్రాల వాహనాలను రోజు మార్చి రోజు రోడ్లపైకి అనుమతించారు. ఈ పక్షం రోజుల్లో ‘సరి-బేసి’తో ఎలాంటి ఫలితాలు వచ్చాయి? రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లు కాలుష్యం దాదాపు 40 శాతం తగ్గిందా? ట్రాఫిక్ రద్దీ మాయమైందా? అని ప్రశ్నిస్తే సానుకూల ఫలితాలే వచ్చాయని చెప్పొచ్చు. అయితే ఈ విధానం వల్ల మాత్రమే కాలుష్యం తగ్గదని, ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడాలని నిపుణులు చెబుతున్నారు. డీజిల్ వాహనాల సంఖ్య తగ్గించి, కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని, సైకిల్, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని అంటున్నారు. తగ్గిన ట్రాఫిక్ రద్దీ .. సరి-బేసి రోజుల్లో చాలా రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గింది. ట్రాఫిక్ జామ్‌లూ చాలా వరకు తగ్గాయి. అయితే ప్రధాన కూడళ్లలో రద్దీ తగ్గలేదు. నగరం చుట్టుపక్కలున్న గుర్గావ్, ఫరీదాబాద్, ఘజియాబాద్ వంటి చోట్లనుంచి వాహనాలు ఎప్పట్లాగే పెద్దసంఖ్యలో వచ్చాయి. ఫోర్టిస్ హాస్పిటల్ నుంచి 10కి.మీ దూరం వెళ్లడానికి ఇదివరకు 35 నిమిషాలు పట్టేదని, ‘సరి-బేసి’తో 18 నిమిషాల్లో వెళ్లగలుతున్నానని ఓ అంబులెన్స్ డ్రైవర్ చెప్పారు. వాహనాల సంఖ్య తగ్గడం వల్ల ప్రయాణికులు గమ్యస్థానాలు చేరుకోడానికి నలుగురు, ఐదుగురు కలసి కారులో(కార్ పూలింగ్) వెళ్లారు, బస్సులు, రైళ్లను కూడా ఆశ్రయించారు. ప్రభుత్వ విధానాల్లో ప్రజల భాగస్వామ్యానికి సరి-బేసి ఒక ఉదాహరణ అని, దీన్ని మిగిలిన రంగాల్లోనూ అమలు చేయాలని పాలనా నిపుణులు చెబుతున్నారు. కాలుష్యం తగ్గిందా?.. ఢిల్లీలో కాలుష్యానికి వాహనాలు మాత్రమే కారణం కాదని నిపుణులు చెబుతున్నారు. పక్షం రోజుల్లో కాలుష్య స్థాయిలు తగ్గాయని రాష్ట్ర సర్కారు చెబుతున్నా, చాలాచోట్ల ఇంతకుముందున్న స్థాయిలే కొనసాగాయని అంటున్నారు. అయితే గతంతో పోలిస్తే కాలుష్యం తగ్గిందని మరికొందరు అంటున్నారు. కస్తూర్బా నగర్‌లోని ద్యాల్సింగ్ కాలేజీ ప్రాంతంలో పీఎం10(10 మైక్రోమీటర్ల వరకు ఉన్న పదార్థం) క్యూబిక్ మీటరుకు 149 మైక్రోగ్రాములుగా నమోదైంది. తూర్పు ఢిల్లీలోని పత్పర్గంజ్లో 500 మైక్రోగ్రాములకు చేరింది. జాతీయ వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) ప్రకారం పీఎం10 స్థాయి 100 మైక్రోగ్రాములు ఉంటేనే సురక్షితం. అతిసూక్ష్మ కణాలైన పీఎం2.5 (2.5 మైక్రోమీటర్ల కంటే చిన్నది) పరిమిత స్థాయి క్యూబిక్ మీటరుకు 66 మైక్రోగ్రాములు కాగా కమలానెహ్రూ కాలేజీ వద్ద 226 మైక్రోగ్రాములు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్(కైలాస్) వద్ద 217 గ్రాములుగా నమోదైంది. ప్రభుత్వం మాత్రం పీఎం10 స్థాయి 450 నుంచి 250 వరకు తగ్గిందని చెబుతోంది. కాలుష్య స్థాయిలు వాహనాల వల్లే కాకుండా గాలి, వాతావరణం, ఇతర స్థానిక ఉద్గారాలపై ఆధారపడి ఉంటుందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) చెప్పారు. తగ్గింపుపై ఇంకా స్పష్టత రావాలని, పక్షం రోజుల్లో ఫలితాలపై తుది అంచనాకు రాలేమని నిపుణులు చెబుతున్నారు. కార్ల కాలుష్యం 40% తగ్గింది: సీఎస్ఈ ‘సరి-బేసి’తో ఢిల్లీలో కార్ల నుంచి వచ్చే ఉద్గారాలు 30- 40 శాతం వరకు తగ్గాయని సీఎస్ఈ తెలిపింది. వీధుల్లో కార్ల సంఖ్య తగ్గడమే దీనికి కారణమని సంస్థ ప్రతినిధి వివేక్ ఛటోపాధ్యాయ చెప్పారు. త్వరలో మెరుగైన విధానం: కేజ్రీ సరి- బేసి వాహన వినియోగం విధానం విజయవంతమైందని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారన్నారు. విధానంలో లోటుపాట్లను అధ్యయనం చేసి.. మెరుగుపర్చిన విధానాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు. ‘సరి-బేసి’కి సహకరించిన పౌరులకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఆదివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘సరి-బేసి’కి మద్దతుగా మరి కొందరితో కలిసి తన వాహనాన్ని పంచుకున్న సీజేఐ జస్టిస్ టీఎస్ ఠాకూర్‌ను ప్రశంసిస్తూ.. ఆయన చర్య లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు. -
మెట్రోలో ముందే సీట్ల బుకింగ్?
► సంపన్నుల కోసం ప్రీమియం సీట్లు ఏర్పాటుచేయాలి ► సామాన్యులకూ మరింత సుఖవంతం చేయాలి ► మెట్రో రైళ్ల రాకపోకలను మరింత పెంచాలి ► ఢిల్లీ మెట్రోకు సుప్రీంకోర్టు సూచన న్యూఢిల్లీ: ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో ప్రవేశపెట్టిన 'సరి-బేసి' అంకెల విధానానికి మద్దతుగా సుప్రీంకోర్టు కొన్నిచర్యలను ప్రతిపాదించింది. ఈ విధానం కారణంగా తమ లగ్జరీ వాహనాలు ఉపయోగించుకోలేని సంపన్నులు, ధనికులు, ప్రముఖుల కోసం 'సౌకర్యవంతమైన ప్రీమియం సీట్లు' ఏర్పాటు చేయాలని ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ)కు సూచించింది. ప్రయాణికులు సాధారణ ధర కంటే ఐదు, ఆరు రెట్లు అధిక ధర చెల్లించి.. మెట్రో రైలులో సీట్లను ముందే బుక్ చేసుకునేలా ప్రీమియం సర్వీసులను అందుబాటులోకి తెచ్చే అవకాశాలను డీఎంఆర్సీ పరిశీలించాలని తెలిపింది. 'కారు యజమానులు మెట్రో కోసం వచ్చినప్పుడు వారికి కూర్చొనేందుకు తగిన చోటు కల్పించాలి. ఉదాహరణకు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ లాంటి వారికి మెర్సిడెస్, టయోటా వంటి భారీ వాహనాలున్నాయి. అలాంటి వారు మెట్రో ఉపయోగించుకోవడానికి వీలుగా మీరు సదుపాయాలు ఎందుకు కల్పించకూడదు' అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. సామాన్య ప్రయాణికుల కోసం కూడా మెట్రో రవాణా సదుపాయాన్ని మరింత సుఖవంతం చేయాలని, రైళ్ల రాకపోకలను మరింతగా పెంచాలని న్యాయస్థానం సూచించింది. -
కిక్కిరిసిన 'ఢిల్లీ మెట్రో'పై పేరడీల జోరు!
న్యూఢిల్లీ: 2016లో అది మొదటి సోమవారం. అంతేకాకుండా అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న 'సరి-బేసి' అంకెల విధానానికి విషమ పరీక్ష ఎదురైంది కూడా సోమవారం నాడే. మూడు రోజుల వారాంతపు సెలవుల అనంతరం ఢిల్లీ వాహనదారులు సోమవారమే రోడెక్కారు. 'సరి-బేసి' విధానం కారణంగా చాలామంది తమ కార్లను ఇంట్లోనే వదిలేసి.. ప్రజారవాణా వ్యవస్థపై ఆధారపడ్డారు. దీంతో ఢిల్లీలోని మెట్రో స్టేషన్లన్నీ కిక్కిరిపోయాయి. సాధారణంగానే రద్దీగా ఉండే రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ మరింత కిటకిటలాడింది. ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీంతోపాటు విపరీతమైన జనంతో కిక్కిరిసిపోయిన మెట్రో స్టేషన్ ఫొటో ఒకటి ట్విట్టర్, ఫేస్బుక్ లో దుమ్మురేపింది. కాసేపటిలోనే విపరీతంగా షేర్ అయి వైరల్ గా మారింది. అయితే ఆ ఫొటో పాతదని, గత ఏడాది అక్టోబర్ 22న తీసిన ఈ ఫొటోకు 'సరి-బేసి' విధానానికి ఎలాంటి సంబంధం లేదని హిందూస్థాన్ టైమ్స్ తన ట్విట్టర్ పేజీలో వెల్లడించడంతో.. ఈ ఫేక్ వైరల్ పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. పాత ఫొటోను వైరల్ చేయడాన్ని తప్పుబడుతూ పేరడీ ఫొటోలతో హోరెత్తించారు. ఢిల్లీలోని రాజీవ్ చౌక్ లో రద్దీ ఎక్కువగా ఉందన్న వార్తలను ఎద్దేవా చేస్తూ పలు ఫొటోలు షేర్ చేశారు. రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ లో రైలు కోసం వేచివేచి ఇలా గడ్డాలు, మీసాలు పెరిగిపోయాయి Huge Crowd at Rajiv Chowk Metro Station. People's hair and beard grown long while waiting to board train pic.twitter.com/xKSIbZllRp — Joy (@Joydas) January 4, 2016 మెట్రోరైలు లేక రాజీవ్ చౌక్ వద్ద ప్రజలు ఇలా బస్సులో కిక్కిరిసిపోయారు! రాజీవ్ చౌక్ వద్ద రద్దీ లేదట.. ప్రజలు ఇలా ఆనందంగా ప్రయాణిస్తున్నారట రాజీవ్ చౌక్ నుంచి ఇప్పుడే బయటకు వస్తున్న కేజ్రీవాల్! రాజీవ్ చౌక్ వద్ద మెట్రో రైలును ఎక్కేందుకు వెళ్తున్నారు.. -
'సరి,బేసి'