బాబు అక్రమ నివాసంపై హైకోర్టులో విచారణ | pil filed in highcourt on chandrababu illigal house construction | Sakshi
Sakshi News home page

బాబు అక్రమ నివాసంపై హైకోర్టులో విచారణ

Published Mon, Feb 29 2016 11:50 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

pil filed in highcourt on chandrababu illigal house construction

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా ఉండవల్లి పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసుకున్న నివాసంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. 60 ఎకరాల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సోమవారం విచారణ జరిపింది.

గతంలో స్థానిక తహశీల్దార్ ఇచ్చిన నోటీసుపై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. సాక్ష్యాత్తూ.. ముఖ్యమంత్రే నదీ పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి కృష్ణానది కరకట్ట పక్కనే నివాసం ఏర్పాటు చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement