సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకంపై ఓ వ్యక్తి రాసిన లేఖని హైదరాబాద్ హైకోర్టు పిల్‌గా స్వీకరించి, విచారణ చేపట్టింది. రైతు బంధు పథకంలో అవకతవకలు జరిగాయంటూ నల్గొండ జిల్లాకు చెందిన యాదగిరి రెడ్డి హైకోర్టుకు ఈ లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు పథకం ద్వారా సామాన్యుల కన్నా భూస్వాములకే ఎక్కువ మేలు జరుగుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. రైతు బంధు పథకంలో మార్పులు చేయాలని కోరారు.
కాగా, ఈ లేఖను పిల్‌గా స్వీకరించిన కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. దీనిపై రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు జూలై 10వ తేదీకి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment