సాక్షి, హైదరాబాద్: రైతుబంధుకు రూ.5,100 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా, ఆ నిధుల విడుదలకు పరిపాలనా అనుమతులిస్తూ వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు. రబీలో రైతులకు పెట్టుబడి సాయం కింద నగదు అందించేందుకు ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది. 2019–20 వార్షిక బడ్జెట్‌లో రైతుబంధు కోసం రూ. 12,862 కోట్లు కేటాయించగా.. ఖరీఫ్‌లో రూ.6,862 కోట్లు మంజూరు చేశారు. రూ.5,100 కోట్లను రబీలో అందించేందుకు రంగం సిద్ధం చేశారు. నిధుల మం జూరుకు సంబంధించిన పరిపాలనా అనుమతులు రావడంతో వ్యవసాయ శాఖ రైతుల వివరాలను ఆర్థికశాఖకు అందించనుంది. కాగా, రైతుబంధుకు నిధులు విడుదల చేయడం పట్ల మంత్రి నిరంజన్‌రెడ్డి ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment