'మందుకు నీళ్లిస్తారు.. మనుషులకివ్వరా?' | i will fill pil on trs governement: revanth reddy | Sakshi
Sakshi News home page

'మందుకు నీళ్లిస్తారు.. మనుషులకివ్వరా?'

Published Thu, Apr 14 2016 7:19 PM | Last Updated on Sun, Sep 3 2017 9:55 PM

'మందుకు నీళ్లిస్తారు.. మనుషులకివ్వరా?'

'మందుకు నీళ్లిస్తారు.. మనుషులకివ్వరా?'

వరంగల్: రాష్ట్రంలో తాగునీరు కొరతతో జనం, పశువులు అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలంగాణ టీడీపీ నేత ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు.

బీర్లు, వైన్, విస్కీ తయారు చేసే బేవరేజెస్ కంపెనీలకు మాత్రం ప్రభుత్వం లక్షల లీటర్ల నీటిని అందిస్తోందని ఆరోపించారు. బేవరేజెస్ కంపెనీలకు ఇచ్చే నీటిని నిలిపివేసి వాటిని ప్రజల తాగునీటి కోసం అందించి వారి దాహార్తిని తీర్చాలని అన్నారు. ప్రభుత్వం స్పందిచకపోతే హైకోర్టును ఆశ్రయించి, ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేస్తానని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement