trs governement
-
కేవలం ఓట్లు, సానుభూతి కోసం ఈటల చీఫ్ ట్రిక్స్..
సాక్షి, హుజూరాబాద్(కరీంనగర్): ఆత్మగౌరవం అంటూ పదే పదే మాట్లాడుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఏడేళ్లుగా ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా? అని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాద్ ప్రశ్నించారు. గురువారం మండలంలోని సింగాపూర్‌లో రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐదేళ్ల నుంచే సీఎం కేసీఆర్‌తో విబేధాలు ఉన్నాయన్న ఈటల ఇన్నేళ్లు మంత్రిగా, పార్టీలో ఎందుకు ఉన్నారన్నారు. గొర్రెల పంపిణీ, దళితబంధు పథకాలు ఒక్క హుజూరాబాద్‌కు సంబందించినవి కాదని, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న పథకాలని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ దానిని హుజూరాబాద్‌తో లింకు పెట్టడం సరికాదన్నారు. భూస్వాములకు రైతుబంధు వద్దన్న ఈటల తన ఖాతాలో జమైన డబ్బులను ప్రభుత్వానికి తిరిగి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గొర్రెల యూనిట్ ధరను హుజూరాబాద్ ఎన్నికల కోసం పెంచలేదని, ప్రస్తుతం పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని మంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన ఈటలకు ఇప్పుడు తప్పులు కనిపిస్తున్నాయా? అని ఎద్దేవా చేశారు. ఈటల రాజేందర్ గెలిస్తే బీజేపీలో రెండు పోయి ముగ్గురు ఎమ్మెల్యేలు అవుతారే తప్పా, ప్రజలకు ఏం మేలు జరుగదన్నారు. పదవి పోగానే గౌరవం మర్చిపోయి మాట్లాడుతున్నారని, ఏడేళ్లు మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే సీఎం నీకు అడ్డు వచ్చాడా? అని, ఇప్పుడు పాదయాత్ర ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించారు. కేవలం ఓట్లు, సానుభూతి కోసం ఈటల చీఫ్ ట్రిక్స్ చేస్తున్నారని ఇక నుంచైనా మానుకోవాలని హితవు పలికారు. ఈటలను ప్రభుత్వం బయటకు పంపలేదని, ఆశలు పెరిగి పోయి చేసుకున్నారని, అది నీ కర్మ అన్నారు. హుజూరాబాద్ ప్రజలు అమ్ముడుపోరని చెప్పిన ఈటల గడియారాలు, కుక్కర్లు ఎందుకు ఇస్తున్నావని ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు వొడితల సతీశ్‌కుమార్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశంయాదవ్, బస్వరాజు సారయ్య, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పిలగాడు ఆగం పట్టడం ఖాయం : మంత్రి నాయిని
ప్రాజెక్టుల విషయంలో మేము చెప్పిందే నిజమైంది జూరాలపై ఆధారపడితే ఎత్తిపోతల పథకాలకు భంగపాటే నారాయణపేట, కొడంగల్‌కు పాలమూరు–రంగారెడ్డి ద్వారా సాగునీరు కోస్గి బహిరంగ సభలో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు బస్‌డిపో, బస్టాండ్ పనులకు శంకుస్థాపన, సీఐ కార్యాలయం ప్రారంభం హాజరైన మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి ఐటీఐ కాలేజీ ఏర్పాటుకు మంత్రి నాయిని హామీ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నాలుగేళ్లుగా పాలమూరు ప్రాంతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసైనా కాంగ్రెస్ నేతలు కళ్లు తెరవాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు సూచించారు. సంక్షేమం, అభివృద్ధి ఫలాలు ప్రజలకు మున్ముందు మరింత సమర్థవంతంగా అందాలంటే టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. జిల్లాలోని కోస్గిలో బస్ డిపో నిర్మాణ పనులతో పాటు బస్‌స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయడమే కాకుండా పోలీస్‌సర్కిల్ కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు. మంత్రులు పట్నం మహేందర్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణతో కలిసి పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు.. ఆ తర్వాత మంత్రి పి.మహేందర్‌రెడ్డి అధ్యక్షతన కోస్గి జూనియర్ కాలేజ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు ప్రసంగం ఆయన మాటల్లోనే.. మేం చెప్పిందే నిజమవుతోంది! సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మేము ముందు నుంచి చెబుతున్న మాటే నిజమైంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును జూరాల నుంచి ప్రారంభించాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ రోజు జూరాల ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? ఈ ప్రాజెక్టు నుంచి మనం వాడుకోగలిగిన నీరు కేవలం 6టీఎంసీలు మాత్రమే. జూరాల మీద ఆధారపడి ఇప్పటికే నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలతో పాటు లక్ష ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం పైనుంచి వరద ఆగిపోయే సరికి ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది. రెండు రోజులు పోతే ఎత్తిపోతల పంపులన్నీ నిలిపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అలాంటిది పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కూడా జూరాలను ఆధారంగా ఏర్పాటు చేస్తే నీళ్లు వచ్చే పరిస్థితి ఉంటుందా? శ్రీశైలం డ్యామ్‌లో 215 టీఎంసీల నీరు ఉంటుంది. కల్వకుర్తి ఎత్తిపోతల పంపులు ఎండాకాలం వచ్చే వరకు నడుస్తాయి. అదే జూరాల మీద ఉన్న నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ పంపులను నడపగలమా? అందుకే సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే పాలమూరు–రంగారెడ్డి పథకాన్ని శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను ఆధారం చేసుకొని చేపట్టారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు గుర్తించాలి. నారాయణపేట, కొడంగల్ ప్రాంతాలకు సాగునీరు అందించే విషయంలో జూరాలపై భారం వేయలేం. అయినా కచ్చితంగా పాలమూరు–రంగారెడ్డి ద్వారా నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. కర్వెన రిజర్వాయర్ ద్వారా 1.30లక్షల ఎకరాలకు, ఉదండాపూర్ రిజర్వాయర్ ద్వారా 70వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. రాబోయే రోజుల్లో ఇది చేసి చూపిస్తాం. కేసుల వల్లే ఆలస్యం.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పరుగెత్తించాలని మేము భావిస్తుంటే కాంగ్రెస్ నేతలు కేసుల ద్వారా అడ్డుపడుతున్నారు. ఈ ప్రాజెక్టుపై పదుల సంఖ్యలో కేసులు వేసిన కారణంగానే అనుకున్నంత వేగంగా పనులు చేయలేకపోయాము. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు వల్ల నల్లమల్ల అభయారణ్యం దెబ్బ తింటుందని కాంగ్రెస్ పార్టీ కొల్లాపూర్ ఇంచార్జీ హర్షవర్దన్‌రెడ్డి గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. అలాగే దేవరకద్రకు చెందిన పవన్‌కుమార్ హైకోర్టులో కేసులు వేశారు. ఇలాంటి చర్యల వల్లే ప్రాజెక్టు పనులు నెమ్మదించాయి. గులాబీ జెండా ఎగరడం ఖాయం రాబోయే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం లో గులాబీ జెండా ఎగరడం ఖాయం. ఎన్నడూ లేని విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగెత్తిస్తున్నాం. మాయమాటల ద్వారా ఒకటి రెండు సార్లు మోసం చేస్తారేమో కానీ ఎల్లకాలం చెల్లుబాటు కాదు(రేవంత్‌ను ఉద్దేశించి). కోస్గికి గతంలో బస్‌డిపో మంజూరు కాకపో యినా మోసపూరితంగా శిలాఫలకం వేశారు. కానీ మేము అలా కాకుండా.. స్థానిక నేతలు అడిగిన వెంటనే 15 రోజుల్లోనే జీఓ మంజూరు చేశాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బస్ డిపోగా కోస్గి రికార్డుకెక్కింది. అలాగే ఆస్పత్రులు, మిషన్ కాకతీయ కింద చెరువుల పూడికతీత, పంచాయితీరాజ్ కింద రోడ్ల నిర్మాణం, విద్యుత్సబ్స్టేషన్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. త్వరలో బోరాంస్పేట, దౌల్తాబాద్‌కు జూనియర్ కాలేజీల ఏర్పాటు చేస్తాం. కోస్గిలో స్థలం గుర్తిస్తే అధునాతన కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేస్తాం. అభివృద్ధి అంటే ఏందో తెలుసా.. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి అభివృద్ధి అంటే ఏందో తెలియదని మంత్రి మహేందర్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో గ్రాఫిక్ చిత్రాలతో ప్రజలను మభ్యపెట్టి రెండు సార్లు గెలుపొందారని... ఇక మునుముందు వారి ఆటలు సాగవన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.900 కోట్ల అభివృద్ధి పనులు చేసినట్లు ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి వివరించారు. మంత్రి హరీశ్‌రావు నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ ఎమ్మెల్యే గుర్నాధరెడ్డి, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బి.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో పిల్లగాడు ఆగం పట్టడం ఖాయమంటూ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రి హరీశ్‌రావు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం ఖాయమని... అందుకే ఈ నియోజకవర్గానికి ఆయన్ని ఇన్‌చార్జీగా సీఎం కేసీఆర్ నియమించారన్నారు. ఇక్కడ విజయం ఖాయమని... కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఆ పిల్లగాడిని అమ్మ దగ్గర పాలు తాగడానికి పంపించేలా ఉన్నారు. సీఎం కేసీఆర్‌ను తిట్టినోడు ఎవరూ బాగుపడలేదని...పిచ్చి కూతలు కూసే ఈ పిల్లగాడిది అదే పరిస్థితి అవుతుందని అన్నారు. పార్లమెంట్లో టీఆర్ఎస్కు ప్రధాని లాంటి జితేందర్‌రెడ్డి కోరిక మేరకు కోస్గిలో ఐటీఐ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి నాయిని -
టీఆర్ఎస్లో కేటీఆర్ జోష్!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అధికార టీఆర్ఎస్ పార్టీలో కొత్త జోష్ కని పిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో అనుకూల స్పందన, పార్టీ అధినేత కేసీఆర్ సర్వేల్లో పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉండడంతో ధీమాతో ఉన్న టీఆర్ఎస్ నేతలకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు ఈనెల 2న జరిపిన కాగజ్‌నగర్ పర్యటన మరింత ఉత్సాహాన్నిచ్చింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత మూతపడ్డ తొలి పరిశ్రమ సిర్పూర్ పేపర్ మిల్స్(ఎస్పీఎం)ను తిరిగి తెరిపించిన ఘనతను సొంతం చేసుకున్న కేటీఆర్ సిర్పూర్ ప్రజానీకానికే గాక ఉమ్మడి జిల్లా ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఈ సభ ద్వారా తమ ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేసిన కేటీఆర్ పరోక్షంగా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. అదే సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్ధంగా ఉండాలని, ప్రజల్లో పార్టీ, ప్రభుత్వంపై ఉన్న అనుకూల వాతావరణాన్ని కొనసాగించేలా కార్యక్రమాలు చేపట్టాలని దిశానిర్ధేశం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. కేటీఆర్ సభ స్ఫూర్తితో ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు భవిష్యత్తులో టిక్కెట్లు ఆశిస్తున్న నేతలు కూడా ఎన్నికల ఎజెండాతో అడుగులు వేస్తున్నారు. రెండు జిల్లాలపై ఎస్పీఎం ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్‌లోని తూర్పు జిల్లాలైన కుమురం భీం, మంచిర్యాల జిల్లాలపై సిర్పూర్ పేపర్ మిల్లు పునఃప్రారంభ ప్రభావం ఎక్కువగా పడిందనడంలో సందేహం లేదు. బొగ్గు గనులతో పాటు సిమెంట్ పరిశ్రమలు ఉన్న ఈ రెండు జిల్లాల్లో మూతపడ్డ పేపర్ మిల్లు తిరిగి తెరుచుకోవడం కొత్త భరోసా ఇచ్చింది. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత 2014లో మూతపడ్డ కాగితం పరిశ్రమను తెరిపించేందుకు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేయని ప్రయత్నమంటూ లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి, కేటీఆర్ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన ద్వారా ఎస్పీఎంను తిరిగి తెరిపించడంలో కీలక పాత్ర పోషించారు. సిర్పూర్ నియోజకవర్గంలో ఎన్నికల వేళ అనూహ్య మార్పులు చోటుచేసుకోవడం గత కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తోంది. కాంగ్రెస్, టీడీపీ హవాలో 1989, 1994లో ఇండిపెండెంట్‌గా పాల్వాయి పురుషోత్తంరావు, 2009లో టీఆర్ఎస్ నుంచి కావేటి సమ్మయ్య, 2014లో బీఎస్పీ నుంచి కోనప్ప విజయం సాధించడం వంటి పరిణామాలన్నీ ఈ నియోజకవర్గం విలక్షణ స్వభావానికి అద్దం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో కూడా అనూహ్య పరిణామాలేవైనా చోటు చేసుకొంటాయేమోనన్న ఆందోళన టీఆర్ఎస్లో ఉండగా, ఎస్పీఎంను తెరిపించడం వల్ల కొత్త ధైర్యం వచ్చినట్లయింది. ఈ ప్రభావం పక్కనే ఉన్న ఆసిఫాబాద్ నియోజకవర్గంపై కూడా పడనుందనడంలో సందేహం లేదు. అలాగే బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఓరియంట్ సిమెంట్ కంపెనీ రూ.2000 కోట్లతో విస్తరణకు సిద్ధమవడం, సింగరేణిలో కొత్త గనులు, కార్మికులకు బోనస్, మెడికల్ అన్‌ఫిట్‌తో ఉద్యోగాలు వంటి పరిణామాలు మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో గల కార్మికులు, ఉద్యోగులు, యువతకు భవిష్యత్తుపై ఆశలను రేకెత్తిస్తోంది. ఈ పరిణామాలన్నీ వచ్చే సాధారణ ఎన్నికల్లో తమకు కలిసివస్తాయని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఆదివాసీలకు కొత్త పంచాయతీలు... సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం ద్వారా నూతన గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయడం ఆదివాసీలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని టీఆర్ఎస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 500 పైబడిన జనాభా ఉన్న ఆదివాసీ గూడేలన్నింటిని పంచాయతీలుగా మార్చడంతో గతంలో 243 పంచాయతీలు ఉన్న ఆదిలాబాద్ జిల్లాలోనే కొత్తగా 226 జీపీలు ఏర్పాటయ్యాయి. మొత్తం ఉమ్మడి జిల్లా పరిధిలో 659 కొత్త గ్రామ పంచాయతీలు రావడం విశేషం. విద్య, ఉద్యోగ, రాజకీయ అంశాల్లో ఒక వర్గం ఆధిపత్యంపై ఆగ్రహంతో స్వయం పాలన, అధికారాల కోసం ఆందోళన చేస్తున్న ఆదివాసీలను ఈ పరిణామం కొంత సంతృప్తి పర్చినట్లయింది. అమ్మ ఒడి పథకం ద్వారా గర్భిణులకు అందించే కేసీఆర్ కిట్స్‌పై ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనలను ఆదివాసీ వర్గానికి సడలింపు చేస్తూ ఇటీవల విడుదల చేసిన జీవో కూడా తమకు ఉపయోగపడుతుందని టీఆర్ఎస్ వర్గాలు చెపుతున్నాయి. అలాగే రైతుబంధు, రైతుబీమా పథకాల ద్వారా అందించే పెట్టుబడి సాయం, రూ.5లక్షల బీమా సౌకర్యాన్ని అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు కూడా వర్తింపజేయడం అనుకూలించే విషయంగా భావిస్తున్నారు. ఆదివాసీ హక్కుల కోసం పోరాడుతున్న మాజీ ఎమ్మెల్యేలు సోయం బాపూరావు, ఆత్రం సక్కు కాంగ్రెస్‌లో ఉండడంతో ఆందోళన చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆదివాసీలకు అందిస్తున్న పథకాలతో ఊపిరి పీల్చినట్లయింది. ఆదివాసీలు కూడా తమతోనే ఉంటారని ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అలాగే ఎస్పీఎం పునరుద్ధరణ నేపథ్యంలో ఆదిలాబాద్ మూతపడిన సీసీఐ పనఃప్రారంభానికి కృషి చేస్తామని కేటీఆర్ ప్రకటించడం ఈ ప్రాంత వాసుల్లో కొత్త ఆశలు కలిగించింది. కేటీఆర్ సూచనతో ప్రజల్లోకి ఎమ్మెల్యేలు, నేతలు కాగజ్‌నగర్ పర్యటనలో భాగంగా ఈనెల 2న ఎస్పీఎం గెస్ట్‌హౌస్‌లో మంత్రి కేటీఆర్ ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో కొద్దిసేపు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పట్ల, ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ప్రజల్లో అనుకూల వాతావరణం ఉందని, వచ్చే ఎన్నికల వరకు దాన్ని కొనసాగించేలా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించినట్లు తెలిసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, నిత్యం ప్రజల్లో ఉంటే జిల్లాలోని 10 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్కు ఢోకా ఉండదని హితబోధ చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ నాయకుల విమర్శలను తిప్పికొట్టడంలో ఎమ్మెల్యేలు మరింత చొరవ చూపాలని సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు గ్రామాల పర్యటనకు రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఆశిస్తున్న పలువురు నేతలు కూడా చాపకింద నీరులా తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
'మందుకు నీళ్లిస్తారు.. మనుషులకివ్వరా?'
వరంగల్: రాష్ట్రంలో తాగునీరు కొరతతో జనం, పశువులు అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలంగాణ టీడీపీ నేత ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. బీర్లు, వైన్, విస్కీ తయారు చేసే బేవరేజెస్ కంపెనీలకు మాత్రం ప్రభుత్వం లక్షల లీటర్ల నీటిని అందిస్తోందని ఆరోపించారు. బేవరేజెస్ కంపెనీలకు ఇచ్చే నీటిని నిలిపివేసి వాటిని ప్రజల తాగునీటి కోసం అందించి వారి దాహార్తిని తీర్చాలని అన్నారు. ప్రభుత్వం స్పందిచకపోతే హైకోర్టును ఆశ్రయించి, ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేస్తానని అన్నారు. -
ప్రైవేట్ విద్యాసంస్థలతో ప్రభుత్వం కుమ్మక్కు
కరీంనగర్: ప్రైవేటు విద్యాసంస్థలతో ప్రభుత్వం కుమ్మక్కైందని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆరోపించారు. అందుకే టీఆర్ఎస్ సర్కార్ కేజీ టు పీజీ విద్య విధానం అమలుచేయడం లేదని మండిపడ్డారు. బుధవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ 2008లోనే వైఎస్ఆర్ ఆంగ్ల మాధ్యమంలో భోదన మొదలు పెట్టారని చెప్పారు. దశలవారీగా అమలుచేసేందుకు సక్సెస్ స్కూల్స్ మొదలు పెట్టారని తెలిపారు. టీచర్ల క్రమబద్ధీకరణ పేరుతో ఆంగ్ల మాధ్య పాఠశాలలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో 50 సక్సెస్ స్కూల్స్ మూతపడ్డాయని చెప్పారు. బంగారు తెలంగాణ అంటున్న కేసీఆర్ చిత్తశుద్ధి ఉంటే విద్యాహక్కు చట్టం అమలుచేయాలని హితవు పలికారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా కేజీ టు పీజీ పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
నిధులివ్వడం లేదు.. పార్టీలో చేరితే ఓకేనట
హైదరాబాద్: తనపై పగతోనే నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రావాల్సిన నిధులను ఆపి కొత్త ప్రాజెక్టులకు ఇస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఆరోపించారు. అధికార పార్టీలో చేరితో ఐదు రోజుల్లో అంతా సక్కబెడతామంటూ ఫోన్లు చేస్తున్నారని ఆరోపించారు. గతంలోనే నారాయణ పేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాలకు అనుమతులు లభించాయని తెలిపారు. జీవో 68తో రూ.1400 కోట్ల నిధులతో భీమా నుంచి 18 టీఎంసీ నీళ్లు తరలించడం లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు.