ప్రైవేట్ విద్యాసంస్థలతో ప్రభుత్వం కుమ్మక్కు
కరీంనగర్: ప్రైవేటు విద్యాసంస్థలతో ప్రభుత్వం కుమ్మక్కైందని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆరోపించారు. అందుకే టీఆర్ఎస్ సర్కార్ కేజీ టు పీజీ విద్య విధానం అమలుచేయడం లేదని మండిపడ్డారు. బుధవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ 2008లోనే వైఎస్ఆర్ ఆంగ్ల మాధ్యమంలో భోదన మొదలు పెట్టారని చెప్పారు.
దశలవారీగా అమలుచేసేందుకు సక్సెస్ స్కూల్స్ మొదలు పెట్టారని తెలిపారు. టీచర్ల క్రమబద్ధీకరణ పేరుతో ఆంగ్ల మాధ్య పాఠశాలలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో 50 సక్సెస్ స్కూల్స్ మూతపడ్డాయని చెప్పారు. బంగారు తెలంగాణ అంటున్న కేసీఆర్ చిత్తశుద్ధి ఉంటే విద్యాహక్కు చట్టం అమలుచేయాలని హితవు పలికారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా కేజీ టు పీజీ పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.