![Behaind The Reason Why Puri Jagannadh Not Attend For Godfather Success Meet - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/12/puri-with-chiranjeevi.jpg.webp?itok=FEV4cEnr)
ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. మోహన్ రాజాగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదలై.. సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. వంద కోట్ల క్లబ్‌ని కూడా దాటేసింది. సినిమా విడుదలైన మూడు రోజులకే సక్సెస్ మీట్‌ని ఏర్పాటు చేసింది చిత్ర బృందం.
ఈ వేడుకకి సినిమా కోసం పని చేసిన టెక్నిషియన్స్‌తో పాటు నటీనటులందరూ వచ్చారు. కానీ కీలక పాత్ర పోషించిన పూరీ జగన్నాథ్ మాత్రం కనిపించలేదు. దీంతో పూరీకి ఏమైంది? చిరు సినిమా సక్సెస్ మీట్‌కి ఎందుకు రాలేదు? అసలు సక్సెస్ మీట్‌కి చిరంజీవి ఆహ్వానించారా? లేదా? అనేది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అసలు విషయం ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి ఆహ్వానించినప్పటికీ.. సక్సెస్ మీట్‌కి పూరీ రాలేనని చెప్పారట.
(చదవండి: సమంత మళ్లీ ప్రేమలో పడిందా..?)
పూరీ ప్రస్తుతం గోవాలో తన తర్వాతి సినిమా స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు. భారీ అంచనాలు పెట్టుకున్న ‘లైగర్’ డిజాస్టర్ కావడంతో.. విజయ్ దేవరకొండ ప్లాన్ చేసిన ‘జనగనమణ’ మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పటికిప్పుడు పూరీతో సినిమా చేయడానికి నిర్మాతలు ఎవరూ ముందుకు రావడం లేదు. హీరోలు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారట. ఇలాంటి సమయంలో బయటకు రావడానికి పూరీ ఇష్టపడడం లేదట.
అందుకే మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి సక్సెస్ మీట్‌కి ఆహ్వానించినా.. సున్నితంగా తిరస్కరించారట. గాడ్ ఫాదర్‌లో పూరీ జగన్నాథ్ పోషించిన జర్నలిస్ట్ పాత్ర అదిరిపోయింది. సక్సెస్ మీట్‌లో కూడా చిరంజీవి పూరీని పొగిడేశాడు. కానీ పూరీ, చిరు ఒకే స్టేజ్ మీద కనిపించి ఉంటే బాగుండేది అంటున్నారు ఆయన అభిమానులు.
Comments
Please login to add a commentAdd a comment