అలా చేస్తే ‘గాడ్‌ ఫాదర్‌’ నుంచి తప్పుకుంటా: చిరుకు సల్మాన్‌ కండిషన్‌! | Is Salman Khan Rejects Remuneration For Godfather Movie | Sakshi
Sakshi News home page

Godfather: అలా చేస్తే మూవీ నుంచి తప్పకుంటా: చిరుకు సల్మాన్‌ కండిషన్‌!

Published Sun, Mar 20 2022 1:14 PM | Last Updated on Sun, Mar 20 2022 2:56 PM

Is Salman Khan Rejects Remuneration For Godfather Movie - Sakshi

On That Condition Salman Doing Godfather: మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం వరస ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతున్నారు. ఆచార్య షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఆయన ఇటీవల గాడ్‌ ఫాదర్‌ షూటింగ్‌ మొదలు పెట్టారు. ఇక ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్రలో కనిపించున్నాడు. ఇక సల్మాన్‌తో షూటింగ్‌ నేపథ్యంలో ఇటీవల చిరంజీవి, గాడ్‌ ఫాదర్‌ టీం ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ చిరంజీవి-సల్మాన్‌లపై యాక్షన్‌ సీన్సోతో పాటు పాటన చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ మూవీ కోసం సల్మాన్‌, చిరుకు ఓ కండిషన్‌ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

చదవండి: Mohan Babu: ఎన్నో రకాలుగా మోసపోయాను, వారెవరు నాకు ఉపయోగపడలేదు..

ఈ మూవీలో సల్మాన్‌ పాత్రపై చర్చలు జరుగుతున్న సమయంలో చిరు-భాయిజాన్‌ మధ్య ఓ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.అయితే గాడ్‌ ఫాదర్‌ కోసం రెమ్యునరేషన్‌ ఎంత తీసుకుంటారని సల్మాన్‌ను దర్శక-నిర్మాతలు అడగ్గా.. ఒక్క పైసా వద్దని చెప్పాడట. ఇదే విషయాన్ని మేకర్స్‌ చిరు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ప్రత్యేకంగా దీంతో సల్మాన్‌ను అడిగారట. దీనికి అతడు అసలు తనకు ఎలాంటి పారితోషకం వద్దని, మీతో నటించడమే అత్యంత గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడట. అయినా తీసుకోవాలని చిరు పట్టుబట్టడంతో.. ఈ విషయంలో తనని బలవంతం చేస్తే మూవీ నుంచి తప్పుకుంటానని హెచ్చరించాడట. అలా సల్మాన్‌ ఖాన్‌ ఒక్కపైసా తీసుకోకుండానే గాడ్‌ ఫాదర్‌కు వర్క్‌ చేస్తున్నాడట.

చదవండి: ఈ అమ్మను విడిచి ఎలా వెళ్లాలనిపించింది: సురేఖ వాణి భావోద్వేగం

అంతేగాక ఈ షూటింగ్‌ షెడ్యూల్‌ అయిపోయే వరకు సల్మాన్‌ ముంబైలోని తన ఫాం హౌజ్‌లో చిరు, గాడ్‌ ఫాదర్‌ టీం అతిథ్యం ఇస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం విధితమే. కాగా సల్మాన్‌ స్నేహానికి ఎంతో విలువ ఇస్తారనే విషయం తెలిసిందే. తనకు ఇష్టమైన వారి కోసం సల్మాన్‌ ఏమైనా చెస్తాడు. అంతేకాదు సాయం చేయడంలో కూడా ఆయన ముందుంటాడు. ఇక బీ-టౌన్‌లో సల్మాన్‌, షారుక్‌ ఖాన్‌ మధ్య మంచి సన్నిహితం ఉంది. అందుకే షారుక్‌ పఠాన్‌ సినిమాలో కూడా కామియో రోల్‌ చేసిన సల్మాన్‌ నయా పైసా తీసుకోలేదట. ఇది తెలిసి ఆయన ఫ్యాన్స్‌, తెలుగు ప్రేక్షకులు భాయిజాన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement