రాజమౌళి డైరెక్షన్‌లో నటించను: చిరంజీవి | Chiranjeevi Interesting Comments On SS Rajamouli At God Father Promotions | Sakshi
Sakshi News home page

Chiranjeevi Comments On Rajamouli: రాజమౌళి డైరెక్షన్‌లో నటించాలని లేదు: చిరంజీవి

Published Sat, Oct 1 2022 10:38 AM | Last Updated on Sat, Oct 1 2022 11:02 AM

Chiranjeevi Interesting Comments On SS Rajamouli At God Father Promotions - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి లేటెస్ట్‌ మూవీ గాడ్‌ ఫాదర్‌. అక్టోరబ్‌ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌తో ఫుల్‌ బిజీగా ఉన్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఓ బాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించిన చిరంజీవి డైరెక్టర్‌ రాజమౌళిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తనకు రాజమౌళి డైరెక్షన్‌లో నటించాలనే కోరిక లేదంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. దీంతో యాంకర్‌ ఎందుకు అని ప్రశ్నించగా.. ‘రాజమౌళి చాలా గొప్ప దర్శకుడు. భారతీయ సినిమా ఖ్యాతిని ఆయన ప్రపంచానికి తెలిపారు. ప్రతి విషయాన్ని ఆయన ఎంతో లోతుగా చూస్తారు. ఆయన కోరుకునే ఔట్‌పుట్‌ని ఓ నటుడిగా నేను ఇవ్వగలనో లేదో తెలియదు’ అని అన్నారు.

చదవండి: పుట్టినరోజుకి ముందు అవార్డు అందుకున్నాను: నటి ఆశా పారేఖ్‌ 

ఆ తర్వాత ‘రాజమౌళి ఓ సినిమాకు ఎంత టైం తీసుకుంటాడో మీకు తెలిసిందే. ఒక్కో సినిమాతో ఆయన 3 నుంచి 5 ఏళ్లు ప్రయాణిస్తారు. కానీ, నేను ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్నా. అందుకే ఆయనతో పనిచేయాలని, పాన్‌ ఇండియా నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశ లేదు’ అని చిరు నవ్వుతూ అన్నారు. అనంతరం ఓ సినిమాకు దర్శకత్వం వహిచాలని ఉంది అని తన మనసులో మాట బయటపెట్టారు. చివరిగా తన తనయుడు, హీరో రామ్‌ చరణ్‌ తన నట ప్రతిభకు కొనసాగింపు అని చిరు ఈసందర్భంగా పేర్కొన్నారు. కాగా మోహన్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయన్‌ తార, సత్యదేవ్‌లు కీలక పాత్రల్లో నటించారు. ఇక బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ అతిథి పాత్ర పోషించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement