ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రాలు ఉన్నాయి. జులై 4న 'గాడ్ ఫాదర్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు చిన్నిపాటి వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో నెట్టింట దూసుకుపోయింది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఫొటో లీక్ అయింది.
ఇందులో సల్మాన్ ఖాన్ (Salman Khan), చిరంజీవి కనిపిస్తున్నారు. ఈ సీన్ చూస్తుంటే ఇది క్లైమాక్స్ పోర్షన్‌లా అనిపిస్తుంది. విలన్‌ను చంపేందుకు వెళ్లేటప్పుడు చిరంజీవికి సల్లూ భాయ్ బాడీగార్డ్‌లా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
చదవండి: భర్త న్యూడ్ ఫొటోలు తీసిన హీరో భార్య.. వైరల్
మిస్ ఇండియా సినీ శెట్టికి ఇష్టమైన తెలుగు హీరో అతడే..
కాగా 'హనుమాన్ జంక్షన్' ఫేమ్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న'గాడ్ ఫాదర్'లో నయన తార, సల్మాన్ ఖాన్ వంటి స్టార్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ మూవీలో నయన తార భర్తగా సత్యదేవ్ నటిస్తున్నాడని టాక్. మలయాళం చిత్రం 'లూసీఫర్'కు రీమేక్ వచ్చిన ఈ మూవీలో అనేక మార్పులు చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment