GodFather: Chiranjeevi, Salman Khan First Single Thaar Maar Released - Sakshi
Sakshi News home page

తార్‌ మార్‌ టక్కర్‌ మార్‌ ఫుల్‌ సాంగ్‌ .. చిరు, సల్మాన్‌ల స్టెప్పులు అదుర్స్‌

Published Wed, Sep 21 2022 4:42 PM | Last Updated on Wed, Sep 21 2022 6:39 PM

GodFather: Chiranjeevi, Salman Khan First Single Thaar Maar Released - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘గాడ్‌ ఫాదర్‌’ తొలి పాట వచ్చేసింది. ‘తార్‌ మార్‌ టక్కర్‌ మార్‌’ అంటూ సాగే ఈ పాటకి చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌ అదిరిపోయే స్టెప్పులేశారు. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ పాట చిరంజీవి తన ముఖం మీద చేయి వేసుకుని స్టైలిష్ ఎంట్రీ ఇస్తే.. సల్మాన్‌ గోళ్లు కొరుకుతూ  ప్రవేశించాడు. అనంతరం వీరిద్దరు యూత్‌ని ఉర్రూతలూగించేలా స్టెప్పులేసి అలరించారు. ఈ మాస్‌ సాంగ్‌కి అనంత శ్రీరామ్‌ లిరిక్స్‌ అందించగా, శ్రేయా ఘోషల్‌ అద్భుతంగా ఆలపించారు . తమన్‌ సంగీతం అందించారు.

ఇక గాడ్‌ఫాదర్‌ విషయానికొస్తే.. మలయాళ బ్లాక్‌బస్టర్‌ ‘లూసీఫర్‌’కు తెలుగు రీమేక్‌ ఇది. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాని రామ్‌ చరణ్‌, ఎన్‌. వి. ప్రసాద్‌, ఆర్‌. బి. చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దసరా కానుక గాఅక్టోబరు 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement