
మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్ రాకకు రంగం సిద్ధమైంది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు చిన్నపాటి వీడియో రిలీజ్ చేశారు. పోస్టర్‌లో చిరు నళ్ల కద్దాలు పెట్టుకుని, చేతికి వాచీతో, జేబులో పెన్నుతో ఏదో సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు కనిపించాడు.
ఇక వీడియోలో రోడ్డుకు ఇరువైపులా జనం జెండాలు పట్టుకుని నిలబడగా మధ్యలో ఓ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి చిరు దిగి స్టైలిష్‌గా నడుచుకుంటూ లోనికి వెళ్లాడు. ఆయన నడకకు తగ్గట్టు తమన్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. చిరంజీవికి ఇది 153వ చిత్రం కాగా ఇందులో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
చదవండి: పిల్లల్ని కనడం గురించి సద్గురును అడిగిన ఉపాసన, ఆయన సమాధానమేంటంటే?
పద్మశ్రీ గ్రహీత, ప్రముఖ దర్శకుడు కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment