Megastar Chiranjeevi Emotional Speech At God Father Pre Release Event - Sakshi
Sakshi News home page

God Father Grand Pre Release Event: ఇదొక శుభపరిణామంగా భావిస్తున్నా: చిరంజీవి

Published Thu, Sep 29 2022 7:28 AM | Last Updated on Thu, Sep 29 2022 8:37 AM

Megastar Chiranjeevi Comments in Godfather Pre Release Event - Sakshi

సాక్షి, అనంతపురం: మోహన్‌ రాజా దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి, బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్, నయనతార నటించిన చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ బ్యానర్స్‌పై రామ్‌చరణ్, ఆర్‌బీ చౌదరి, ఎన్‌వీ ప్రసాద్‌ నిర్మించారు. చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో బుధవారం సాయంత్రం నుంచి నిర్వహించారు. ఈ వేడుకకు చిరంజీవి హాజరయ్యారు.

తొలుత డ్యాన్సులు, పాటలు అభిమానుల కేరింతలు, కేకలతో ఆర్ట్స్‌ కళాశాల మైదానం హోరెత్తింది. సంగీత దర్శకుడు తమన్‌ నేతృత్వంలో శ్రీరామచంద్ర, కృష్ణ వంటి గాయకులు పాటలతో హుషారెత్తించారు. అనంతరం చిరంజీవి ప్రసంగిస్తున్న సమయంలోనే వర్షం కురిసింది. అయినా అభిమానులు ఉన్నచోటు నుంచి కదలలేదు.

వర్షంలోనే చిరంజీవి మాట్లాడుతూ భారీ చిత్రాలతో పాటు చిన్న సినిమాలనూ ఆదరించినపుడే చిత్ర పరిశ్రమ పచ్చగా ఉంటుందని పేర్కొన్నారు. తానెప్పుడు రాయలసీమకు వచ్చినా వర్షం పడుతోందని, ఇదొక శుభపరిణామంగా భావిస్తున్నానని చెప్పారు. ఇదిలా ఉండగా పరిమితికి మించి గ్రౌండ్‌లోకి అభిమానులు రావడంతో తొక్కిసలాట, తోపులాట జరిగింది. అదుపు చేయడానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది.  

 

👉 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: (ఐశ్వర్యారాయ్‌ అందానికి వశమైన శరత్‌కుమార్‌)                  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement