పాత శ్రీకాకుళం: మెగాస్టార్ చిరంజీవి 61వ పుట్టిన రోజు వేడుకలు స్థానిక బెహరా మనోవికాస కేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్ష కార్యదర్శులు తైక్వోండో శ్రీను, జీవీ నరిసింహం కేకు కట్‌చేసి అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం బెహర మనోవికాస కేంద్రంలోని పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పలు థియేటర్ల మేనేజర్లు వరప్రసాద్, బోసుబాబు, చినరాజు తదితరులు పాల్గొన్నారు.