మెగాస్టార్ చిరంజీవి బయట ఎంత ప్రశాంతంగా ఉంటారో అందరికి తెలిసిందే. ప్రెస్ మీట్‌లో కూడా తనదైన శైలీలో జోకులు వేస్తూ.. సరదాగా ఉంటారు. షూటింగ్ సమయంలో కూడా అలానే ఉంటారట. కానీ నిర్మాతలకు నష్టం కలిగించే పని చేస్తే మాత్రం ఘోరంగా ఫైర్ అవుతారట. ఈ విషయాన్ని డైరెక్టర్ బాబీ చెప్పారు. చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలై సూపర్ హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. దీంతో శనివారం చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు బాబీ, మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తిక విషయాలు వెల్లడించారు.
‘సెట్‌లో చిరంజీవి పొగడ్తల్ని పట్టించుకోరు. కానీ.. నిర్మాతకి రూపాయి నష్టం వచ్చే పని చేస్తే మాత్రం ఆయనికి కోపం వచ్చేస్తుంది. వేరే సినిమా షూటింగ్‌లో ఆయనలోని శివుడిని నేను చూశా. షాట్‌కి పిలవకుండా మేనేజర్ ఇబ్బంది పడుతుంటే.. ఫస్ట్ టైమ్ చిరంజీవికి కోపం రావడాన్ని చూసి నేను షాక్ అయిపోయా. చైర్ విసిరేసి.. మీబోడి ఫెర్ఫార్మెన్స్ నా దగ్గరొద్దు. నేను ఇక్కడ తినే ఇడ్లీ కన్నా.. అక్కడ షాట్ ఇంపార్టెంట్’ అంటూ సిబ్బందిపై ఫైర్ అయిన మెగాస్టార్‌ని నేను దూరం నుంచి చూశాను. సినిమాకు ఇబ్బంది కలిగితే అన్నయ్యకు కోపం వస్తుందని నాకు అర్థమైంది.
వాల్తేరు వీరయ్య షూటింగ్ టైమ్‌లో అలా ఇబ్బంది తేకూడదని ప్రయత్నించా. ఈ క్రమంలో ఓ రోజు ఫోన్ చేసి.. అన్నయ్యా... పీటర్ మాస్టర్ ఊరెళ్తానని అంటున్నారు. ఒక ఫైట్ సీన్.. మీరు సాంగ్ గ్యాప్‌లో ఓ మూడు గంటలు వస్తే? అంటూ మొహమాటంగా చెప్పాను. దానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నావ్.. కరెక్ట్‌గా చెప్పు నాకు అర్థం అవ్వడం లేదు అని చిరంజీవి గారు అన్నారు. ఏం లేదు అన్నయ్య మీరు రేపు ఓ మూడు గంటలు వస్తే.. మీ పోర్షన్ కంప్లీట్ చేస్తాను. మళ్లీ రేప్పొద్దున ‘నాకు చెప్పాలి కదా సెట్ ఎందుకు హోల్డయ్యిందని’ అంటారని చెప్పేస్తున్నా అని చెప్పాను. దానికి ఇంతగా చెప్పాలా బాబీ.. రేపు మీరు రా అన్నయ్యా అంటే రానా? అంటూ చాలా సింపుల్‌గా చెప్పారు’అని బాబీ గుర్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment