చిరంజవి, రవితేజలు ఎలా అయితే ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చారో నేను కూడా అలాగే ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇప్పుడు వాళ్లిద్దరితో కలిసి వాల్తేరు వీరయ్య సినిమా చేయడం నా అదృష్టం. ఒక ఫ్యాన్ బాయ్ గా మొదలుపెట్టి ఒక డైరెక్టర్ గా ఇద్దరి పాత్రలని బ్యాలెన్స్ డిజైన్ చేశాను. ఇందులో చివరి వరకూ కథే గొప్పగా కనిపిస్తుంది’అని యంగ్ అండ్ టాలెంట్ డైరెక్టర్ కేఎస్ రవీంద్ర (బాబీ) అన్నారు. ఆయన దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం వాల్తేరు వీరయ్య. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా తాజాగా బాబీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
► చిరంజీవికి ఒక ఫ్యాన్ బాయ్ గా 2003 నా జర్నీ మొదలైయింది. చిరంజీవి గారి సినిమాలో పని చేయాలనే ఒక కల ఉండేది. ఇప్పుడు 2023లో మెగాస్టార్ చిరంజీవి గారిని డైరెక్ట్ చేసిన సినిమా విడుదవుతోంది. నా జీవితంలో మర్చిపోలేని స్పెషల్ మూమెంట్ ఇది. మాస్ ఆడియన్స్ ఏం కావాలో అనే దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి స్టోరీ డిజైన్ చేయడం జరిగింది.
► మెగాస్టార్ చిరంజీవి ఎన్నో విజయాలు బ్లాక్ బస్టర్లు అలాగే కొన్ని అపజయాలు కూడా చూసుంటారు. ఆయనకి ఉన్నంత బ్యాలెన్స్ ఎవరికీ ఉండదని కూడా చెప్పొచ్చు. అలాగే రవితేజ గారు కూడా అంతే. ఒక సినిమాకి చేయాల్సిన న్యాయం కష్టం సర్వస్వం పెడతారు. ఫలితం మాత్రం ప్రేక్షకుల చేతిలో ఉంటుందని బలంగా నమ్ముతారు.
► లాక్ డౌన్ కి ముందు ఒక ఫ్యాన్ బాయ్ గానే చిరంజీవికి ఈ కథ చెప్పాను. అయితే లాక్ డౌన్ లో పరిస్థితులు మారిపోయాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు ఓటీటీకీ అలవాటు పడ్డారు. డిఫరెంట్ కంటెంట్ కి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో అందరినీ అలరించే కథ చెప్పాలని ప్రత్యేక దృష్టి పెట్టాం. దాంట్లో నుంచి వచ్చిన క్యారెక్టరే రవితేజ గారిది. ఇందులో చివరి వరకూ కథే గొప్పగా కనిపిస్తుంది. బీసి సెంటర్ ఆడియన్స్ తో పాటు మల్టీ ప్లెక్స్ ప్రేక్షకులని కూడా అలరించే అన్ని గుణాలు లక్షణాలు వాల్తేరు వీరయ్యలో కనిపిస్తాయి.
► చిరంజీవి గారు, రవితేజ గారి కాంబినేషన్‌లో వచ్చే ప్రతి సీన్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగుతుంది. అలాగే అద్భుతమైన ఎమోషన్ ఉంటాయి. పండక్కి రాబోతున్న కలర్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు బ్యూటీఫుల్ ఎమోషన్స్ ఉన్న చిత్రం వాల్తేరు వీరయ్య.
► రవితేజ గారి చాయిస్ నాదే. రవితేజ గారిని తీసుకోవాలనే ఆలోచన రావడం, చిరంజీవి గారికి చెప్పడం, ఆయన మరో ఆలోచన లేకుండా ఓకే అనడం, చిరంజీవి గారిపై ఉన్న ప్రేమ అభిమానం, నాపై ఉన్న నమ్మకంతో రవితేజ గారు ఒప్పుకోవడం జరిగింది.
► ఈ చిత్రంలో ముఠామేస్త్రీ, గ్యాంగ్ లీడర్ లాంటి వింటేజ్ లుక్ కనిపిస్తోందని అంతా అంటున్నారు. వాల్తేరు వీరయ్య పాత్రకు అలాంటి లిబర్టీ ఉంది. ఆయన లుంగీ కట్టుకోవచ్చు, బీడీ తాగొచ్చు.. గ్యాంగ్ లీడర్ లా గన్ పట్టుకొని వార్ కి రావచ్చు. ఆ ఫ్రీడమ్ అంతా వీరయ్య క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది తప్పితే బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయలేదు.
► చిరంజీవి గారి డ్యాన్స్ తో పాటు ఫన్ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటాం. ఫన్ టైమింగ్ లో ఆయన మాస్టర్ . మనం ఫన్ ఇవ్వగలిగితే దాన్ని స్కై లెవల్ కి తీసుకెళ్ళిపోతారాయన. ఆ మ్యాజిక్ అంతా చూస్తూ పెరిగాను. ఈ ఎనర్జీ అంతా ఆయన నుంచి తీసుకోవడం జరిగింది.
► వాల్తేరు వీరయ్య ఫస్ట్ కాపీని చిరంజీవి చూసి ‘బస్టర్ కొడుతున్నాం బాబీ’ అన్నారు. ఆ రోజు నేను గర్వంగా ఫీలయ్యాను. ఆయన నన్ను ఓ తమ్ముడిగా దగ్గరకు తీసుకున్న ఆత్మీయత నా జీవితంలో మర్చిపోలేను. చిరంజీవి గారి లాంటి మాస్ మూలవిరాట్ నన్ను కౌగలించుకొని ముద్దు పెట్టుకోవడం మర్చిపోలేని మూమెంట్. ఆ ఫోటోని ఫ్రేమ్ కట్టించుకున్నా.
► చిరంజీవి గారిది దేవిశ్రీ ది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వాల్తేరు వీరయ్య ఆల్బమ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. సినిమా థియేటర్ కి వచ్చే ముందు మొదట గెలిచేది ఆడియో పరంగా. అలా మమ్మల్ని గెలిపించిన దేవిశ్రీ ప్రసాద్ గారి కి మా టీం అందరి తరపున కృతజ్ఞతలు.
► మైత్రీ మూవీ మేకర్స్ తో కలసి పని చేయాలని ఎప్పటినుండో ఉండేది. ఇలాంటి సమయంలో నవీన్ గారు సినిమా చేద్దామని అడిగారు. తర్వాత జర్నీ మొదలైయింది. అద్భుతమైన నిర్మాతలు. సినిమా అంటే ప్యాషన్. సినిమాకి ఏం కావాలో ఎక్కడ రాజీ పడకుండా సమకూరుస్తారు.
Comments
Please login to add a commentAdd a comment