Director Bobby Father Died Due To Health Illness In Hyderabad - Sakshi
Sakshi News home page

Director Bobby: విషాదం.. డైరెక్టర్‌ బాబీకి పితృవియోగం

Published Sun, Aug 28 2022 2:54 PM | Last Updated on Sun, Aug 28 2022 3:35 PM

Director Bobby Father Passes Away Due To Illness - Sakshi

ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు బాబీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకు పితృవియోగం కలిగింది. వివరాల్లోకి వెళితే.. బాబీ తండ్రి మోహనరావు(69)గత కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో నేడు(ఆదివారం) తుదిశ్వాస విడిచారు.

విషయం తెలిసుకున్న పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా బాబీ ప్రస్తుతం చిరంజీవితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’పేరుతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement