మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వాల్తేరు వీరయ్య’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఓ ప్రత్యేక సాంగ్‌ను ఫ్రాన్స్‌లో షూట్ చేస్తున్నారు. ఈ పాటను దట్టమైన మంచు పర్వతాల్లో శృతిహాసన్, మెగాస్టార్ చిరంజీవిపై చిత్రీకరించారు. తాజాగా మెగాస్టార్ షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అది కాస్తా వైరల్ కావడంతో ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. జనవరి 13 థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
మెగాస్టార్ మాట్లాడుతూ.. 'హాయ్ ఫ్రెండ్స్ నేను ఫ్రాన్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఈనెల 12న నేను శృతిహాసన్‌తో చేసిన ఓ సాంగ్ ఫినిష్ చేశాం. ఈ షూట్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఎందుకంటే ఆ లోకేషన్స్ కానీవ్వండి. సాంగ్ కానీవ్వండి. సో బ్యూటీఫుల్. ఈ లోకేషన్ సౌత్ ఆఫ్ ఫ్రాన్స్‌లో ఉంది. ఆ పేరు లేజే లేజే. ఇది స్విట్జర్లాండ్, ఇటలీ బార్డర్‌లో ఉన్న మౌంటెన్స్‌లో ఉంటుంది ఈ ప్రాంతం. ఈ పాట కోసం యూనిట్ మొత్తం చాలా కష్టపడింది. దాదాపు -8 డిగ్రీల చలిలో ఈ పాటను షూట్ చేశాం. నిజంగా ఆ లోకేషన్ చాలా అందంగా ఉంటుంది. మేము పడిన కష్టానికి తగిన ఫలితం వచ్చింది. ఈ విషయాన్ని మీతో పంచుకునేందుకు నేను ఆగలేకపోయాను. అయితే మీకోసం ఈ పాట నుంచి ఓ చిన్న బిట్‌ను లీక్ చేస్తున్నా. ఎవరికీ చెప్పకండి. త్వరలోనే మీ ముందుకు లిరికల్ సాంగ్ రానుంది.' అంటూ మెగాస్టార్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. 'నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరంజీవిని.. రాయే రాయే రాయే' అంటూ సాగే సాంగ్ లిరిక్స్ లీక్ చేస్తున్నా అంటూ నవ్వుతూ చెప్పారు మెగాస్టార్.
Comments
Please login to add a commentAdd a comment