Chiru Bobby Movie Heroine: Is Shruti Haasan To Play Female Lead In #Mega154 - Sakshi
Sakshi News home page

Shruti Haasan: శ్రుతీహాసన్‌ లిస్ట్‌లో మరో భారీ ఆఫర్‌.. తొలిసారి ఆ హీరోతో..

Published Fri, Jan 7 2022 8:14 AM | Last Updated on Fri, Jan 28 2022 12:26 PM

Shruti Haasan To Play Female Lead In Chiranjeevi, Bobby Movie - Sakshi

శ్రుతీహాసన్‌ లిస్ట్‌లో మరో భారీ ఆఫర్‌ చేరనుందా? అంటే ఫిల్మ్‌నగర్‌ అవుననే అంటోంది. చిరంజీవి సరసన ఈ బ్యూటీ జోడీ కట్టనున్నారని టాక్‌. బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఇందులో శ్రుతీహాసన్‌ని కథానాయికగా ఎంపిక చేశారట. ఈ చిత్రంలో చిరంజీవి మత్స్యకారుడిగా కనిపించనున్నారని, టైటిల్‌ ‘వాల్తేరు వీరయ్య’ అనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.

ఇక రవితేజతో చేసిన ‘క్రాక్‌’ హిట్‌తో శ్రుతి మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చారు. ప్రస్తుతం ప్రభాస్‌ సరసన ‘సలార్‌’లో నటిస్తున్నారామె. ఇటీవలే బాలకృష్ణ సరసన సినిమా చేయడానికి అంగీకరించారు. ఇప్పుడు వార్తల్లో ఉన్నట్లు మరో పెద్ద ఆఫర్‌ ఉందా? చిరంజీవి–శ్రుతీ కాంబో కుదురుతుందా? అనేది తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement