బల్‌దేవ్ సహాయ్ పాత్ర మరిచిపోలేను | Special thanks Bobby says ravi teja | Sakshi
Sakshi News home page

బల్‌దేవ్ సహాయ్ పాత్ర మరిచిపోలేను

Published Thu, Sep 18 2014 11:36 PM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM

బల్‌దేవ్ సహాయ్ పాత్ర మరిచిపోలేను

బల్‌దేవ్ సహాయ్ పాత్ర మరిచిపోలేను

 ‘‘నాకూ ప్రకాశ్‌రాజ్‌కి, నాకూ బ్రహ్మానందం గారికి మంచి కెమిస్ట్రీ కుదురుతుందని అందరూ అంటారు. ‘పవర్’తో మరోసారి అది రుజువైంది. ఇందులో బల్‌దేవ్ సహాయ్ పాత్రను మరచిపోలేను. ఇలాంటి పాత్రను నాకోసం రూపొందించిన బాబీకి ప్రత్యేక ధన్యవాదాలు’’ అని రవితేజ చెప్పారు. రవితేజ, హన్సిక, రెజీనా కాంబినేషన్‌లో కేయస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ‘రాక్‌లైన్’ వెంకటేశ్ నిర్మించిన ‘పవర్’ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయోత్సవ వేడుక హైదరాబాద్‌లో జరిగింది.
 
  ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ -‘‘ ‘పవర్’తో పరిశ్రమకు స్వర్ణయుగం మొదలుకానుంది. ‘ఆగడు’లో నేను లేను కానీ, తప్పక ఆడే సినిమా అది. ఆ తర్వాత గోవిందుడు అందరివాడేలే, పూరి జగన్నాథ్ సినిమా... వంటివన్నీ వరుసలో ఉన్నాయి. అన్నీ ఆడే సినిమాలే’’ అని అన్నారు. రవితేజ శక్తి సామర్థ్యాలని పూర్తిగా వెలికితీసే కథ ఇంకా రాలేదని, ఎవరైనా తెస్తే చేయడానికి తాను సిద్ధమేనని ‘రాక్‌లైన్’ వెంకటేశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బాబి, కోన వెంకట్, తమన్, పోసాని, బ్రహ్మాజీ, ఉత్తేజ్, గౌతంరాజు, సప్తగిరి, భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement