Raklain Venkatesh
-
రజనీకాంత్ 'లింగా' స్టిల్స్
-
అదిరిపోయింది!
సూపర్‌స్టార్ సూపర్ స్టయిల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులంతా వేయి కన్నులతో ‘లింగ’ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. చిత్రీకరణ నుంచే అంచనాలు అంబరాన్ని తాకిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీకాంత్ పుట్టిన రోజు కానుకగా డిసెంబర్ 12న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత ‘రాక్‌లైన్’ వెంకటేశ్ సన్నాహాలు చేస్తున్నారు. రజనీకాంత్‌తో ‘ముత్తు’, ‘నరసింహా’ లాంటి బ్లాక్‌బస్టర్స్ అందించిన కేఎస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అనుష్క, సోనాక్షీ సిన్హా కథానాయికలు. నిర్మాణం తుది దశకు చేరుకున్న ఈ చిత్రం గురించి ‘రాక్‌లైన్’ వెంకటేశ్ మాట్లాడుతూ -‘‘సూపర్‌స్టార్‌తో సినిమా చేస్తున్నాను అనే ఫీలింగే చెప్పలేనంత ఆనందాన్నిస్తోంది. రజనీ-కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో వచ్చిన ముత్తు, నరసింహా చిత్రాలను మించే స్థాయిలో ఈ సినిమా ఉంటుంది. ‘లింగ’ ఫస్ట్‌లుక్‌ని వినాయకచవితి కానుకగా విడుదల చేశాం. దీపావళి కానుకగా మరో లుక్ విడుదల చేశాం. స్పందన అదిరిపోయింది. ఇటీవలే హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో మూడున్నర కోట్ల భారీ వ్యయంతో రజనీ, సోనాక్షి, 200 మంది డాన్సర్లతో ఓ పాట చిత్రీకరించాం. సూపర్‌స్టార్ అభిమానులు థియేటర్లో విజిల్స్ వేసేలా ఈ పాట ఉంటుంది. ప్రస్తుతం దుబాయ్, మోకా, అబుదాబీల్లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. అబ్రాడ్‌లోనే కొన్ని సాంగ్స్ సీక్వెన్స్, ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరణ జరుపనున్నాం. ఏఆర్ రెహమాన్ సంగీతం, రత్నవేలు కెమెరా ఈ చిత్రానికి మెయిన్ హైలైట్స్. దేశంలోని ఉన్నతమైన సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ చిత్రం పాటలను నవంబర్ రెండో వారం విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. -
బల్దేవ్ సహాయ్ పాత్ర మరిచిపోలేను
‘‘నాకూ ప్రకాశ్‌రాజ్‌కి, నాకూ బ్రహ్మానందం గారికి మంచి కెమిస్ట్రీ కుదురుతుందని అందరూ అంటారు. ‘పవర్’తో మరోసారి అది రుజువైంది. ఇందులో బల్దేవ్ సహాయ్ పాత్రను మరచిపోలేను. ఇలాంటి పాత్రను నాకోసం రూపొందించిన బాబీకి ప్రత్యేక ధన్యవాదాలు’’ అని రవితేజ చెప్పారు. రవితేజ, హన్సిక, రెజీనా కాంబినేషన్లో కేయస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ‘రాక్‌లైన్’ వెంకటేశ్ నిర్మించిన ‘పవర్’ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయోత్సవ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ -‘‘ ‘పవర్’తో పరిశ్రమకు స్వర్ణయుగం మొదలుకానుంది. ‘ఆగడు’లో నేను లేను కానీ, తప్పక ఆడే సినిమా అది. ఆ తర్వాత గోవిందుడు అందరివాడేలే, పూరి జగన్నాథ్ సినిమా... వంటివన్నీ వరుసలో ఉన్నాయి. అన్నీ ఆడే సినిమాలే’’ అని అన్నారు. రవితేజ శక్తి సామర్థ్యాలని పూర్తిగా వెలికితీసే కథ ఇంకా రాలేదని, ఎవరైనా తెస్తే చేయడానికి తాను సిద్ధమేనని ‘రాక్‌లైన్’ వెంకటేశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బాబి, కోన వెంకట్, తమన్, పోసాని, బ్రహ్మాజీ, ఉత్తేజ్, గౌతంరాజు, సప్తగిరి, భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు. -
పవర్ మూవీ వర్కింగ్ స్టిల్స్
-
సరికొత్త రవితేజ కనిపిస్తాడు!
‘‘ఇప్పటివరకూ చూడని ఓ సరికొత్త రవితేజను ‘పవర్’ సినిమాలో చూస్తారు’’ అంటున్నారు దర్శకుడు కె.ఎస్.రవీంద్ర (బాబి). ‘రాక్‌లైన్’ వెంకటేశ్ నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకొని సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా బాబి మాట్లాడుతూ -‘‘రవితేజ సహకా రంతో అద్భుతమైన యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించాను. తమన్ సంగీతం ఇప్పటికే పెద్ద హిట్. అందరూ మెచ్చే సినిమా ఇది’’ అని తెలిపారు. దర్శకుడు జనరంజకంగా చిత్రాన్ని తీర్చిదిద్దారని, రవితేజ పాడిన ‘నోటంగి... నోటంగి’ ఇప్పటికే శ్రోతల నోళ్లల్లో నానుతోందని నిర్మాత ఆనందం వెలిబుచ్చారు. హన్సిక, రెజీనా ఇందులో నాయికలు. ఈ చిత్రానికి మాటలు: కోన వెంకట్, కెమెరా: జయనన్ విన్సెంట్, మనోజ్ పరమహంస.