సరికొత్త రవితేజ కనిపిస్తాడు! | Raviteja Movie Power Release on 5th September | Sakshi
Sakshi News home page

సరికొత్త రవితేజ కనిపిస్తాడు!

Published Tue, Aug 26 2014 11:52 PM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM

సరికొత్త రవితేజ కనిపిస్తాడు!

సరికొత్త రవితేజ కనిపిస్తాడు!

 ‘‘ఇప్పటివరకూ చూడని ఓ సరికొత్త రవితేజను ‘పవర్’ సినిమాలో చూస్తారు’’ అంటున్నారు దర్శకుడు కె.ఎస్.రవీంద్ర (బాబి). ‘రాక్‌లైన్’ వెంకటేశ్ నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకొని సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా బాబి మాట్లాడుతూ -‘‘రవితేజ సహకా రంతో అద్భుతమైన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించాను. తమన్ సంగీతం ఇప్పటికే పెద్ద హిట్. అందరూ మెచ్చే సినిమా ఇది’’ అని తెలిపారు. దర్శకుడు జనరంజకంగా చిత్రాన్ని తీర్చిదిద్దారని, రవితేజ పాడిన ‘నోటంగి... నోటంగి’ ఇప్పటికే శ్రోతల నోళ్లల్లో నానుతోందని నిర్మాత ఆనందం వెలిబుచ్చారు. హన్సిక, రెజీనా ఇందులో నాయికలు. ఈ చిత్రానికి మాటలు: కోన వెంకట్, కెమెరా: జయనన్ విన్సెంట్, మనోజ్  పరమహంస.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement