ఒక్క ఛేజింగ్ సీన్కే 2 కోట్ల ఖర్చు!! | 'Power' makers to splash 2 crore on chase sequence | Sakshi
Sakshi News home page

ఒక్క ఛేజింగ్ సీన్కే 2 కోట్ల ఖర్చు!!

Published Mon, Apr 28 2014 11:39 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

ఒక్క ఛేజింగ్ సీన్కే 2 కోట్ల ఖర్చు!! - Sakshi

ఒక్క ఛేజింగ్ సీన్కే 2 కోట్ల ఖర్చు!!

మాస్ హీరో రవితేజ నటిస్తున్న 'పవర్' చిత్రంలో ఓ ఛేజింగ్ సన్నివేశం చిత్రీకరణకు దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారు. త్వరలోనే ఈ సన్నివేశాన్ని బ్యాంకాక్లో చిత్రీకరిస్తారు. బాలీవుడ్ స్టంట్మన్ అలన్ అమీన్ ఈ సన్నివేశానికి కొరియోగ్రాఫ్ చేస్తారు. చిత్రంలో ఇది చాలా కీలకమైన సన్నివేశమని, అందుకే దీనికోసం తాము అంత పెద్దమొత్తం ఖర్చు పెడుతున్నామని సినిమా దర్శకుడు కేఎస్ రవీంద్రనాథ్ తెలిపారు.

ధూమ్, రంగ్ దే బసంతి లాంటి చిత్రాలకు చేసిన అలన్ అమీన్ను దీనికోసం తెస్తున్నట్లు చెప్పారు. షూటింగ్ కోసం చిత్ర యూనిట్ మే నెల మొదటివారంలో బ్యాంకాక్ వెళ్లనుంది. మే 3 నుంచి 10వ తేదీ వరకు అక్కడ షూటింగ్ ఉంటుంది. ఇందులో రవితేజ, అజయ్, సంపత్ రాజ్, సుబ్బరాజు తదితరులు పాల్గొంటారు. హన్సిక, రెజినా కాసండ్రా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాక్లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement