రవితేజ వల్ల మాలాంటి వారికి ఇబ్బందులు: తేజ సజ్జా కామెంట్స్ వైరల్! | Eagle With HanuMan Full Interview Video: Hanuman Hero Teja Sajja Crazy Comments On Mass Hero Raviteja, Goes Viral - Sakshi
Sakshi News home page

Teja Sajja-Ravi Teja Interview: గురు.. మీ వల్లే హీరోయిన్లతో ఇబ్బందులు: రవితేజపై సజ్జా కామెంట్స్!

Published Sun, Jan 28 2024 8:57 PM | Last Updated on Mon, Jan 29 2024 10:29 AM

Hanuman Hero Teja Sajja Crazy Comments On Mass Hero Raviteja - Sakshi

ఈ ఏడాది సంక్రాంతికి హనుమాన్‌తో సూపర్‌ కొట్టిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. పెద్ద సినిమాలతో పోటీపడి మరీ సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఈ సినిమాలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించారు. జనవరి 12న థియేటర్లలో రిలీజైన బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. మహేశ్‌బాబు- గుంటూరు కారం, వెంకటేష్- సైంధవ్, నాగార్జున- నా సామిరంగా చిత్రాలతో పోటీపడి నిలిచింది. అయితే ప్రస్తుతం ఈగల్‌ సినిమాతో ప్రేక్షకులను పలరించేందుకు వస్తోన్న మాస్ మహారాజా రవితేజ.. తేజ సజ్జాతో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా హనుమాన్ హీరో తేజ సజ్జా ఆయనకు పలు ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించారు. వీరిద్దరి మధ్య జరిగిన ఓ ఫన్నీ సమస్యను గురించి ప్రస్తావించారు. రవితేజ వల్ల ఇండస్ట్రీలోకి వస్తున్న కొత్త హీరోలు చాలా ఇబ్బందులు పడుతున్నారంటూ చెప్పి షాకిచ్చాడు తేజ సజ్జా. 

(ఇది చదవండి: దేవర భామకు బిగ్ ఛాన్స్.. ఏకంగా రూ.500 కోట్ల సినిమాలో!)

మీరు చేసే ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఎందుకు ఉంటున్నారు? అంటూ రవితేజను తేజ సజ్జా ప్రశ్నించారు. టైగర్, రావణాసుర సినిమాల్లో అలాగే ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. అందువల్ల మాలాంటి యంగ్‌ హీరోలకు చాలా ప్రాబ్లమ్ అవుతోంది. మీరు చేసే సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉంటున్నారు. మీరు ఏడాదికి మూడు చిత్రాలు చేస్తున్నారు. దాదాపు 12మందిని ఆడిషన్స్ చేస్తారు. దీంతో ఎవరినీ అడిగినా.. మేం రవితేజతో సినిమా చేస్తున్నాం. ఆ తర్వాతనే చేస్తామని చెబుతున్నారు. మీరు ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్‌ను తీసుకోవడం వల్ల మాలాంటి యువ హీరోలు ఇబ్బందులు పడుతున్నారు' అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు తేజ సజ్జా. కాగా.. రవితేజ నటించిన ఈగల్ కావ్య తాపర్, అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండగా.. పోటీ పెరగడంతో పోస్ట్ పోన్‌ చేసుకున్నారు. ఫిబ్రవరి 9న విడుదలవుతోన్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement