బెడిసికొట్టిన పోలీస్ డ్రెస్! | Police dress fell out in cinemas | Sakshi
Sakshi News home page

బెడిసికొట్టిన పోలీస్ డ్రెస్!

Published Wed, Sep 24 2014 5:02 PM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM

బెడిసికొట్టిన పోలీస్ డ్రెస్!

బెడిసికొట్టిన పోలీస్ డ్రెస్!

టాలీవుడ్ హీరోలు పోలీస్ డ్రెస్ వేసుకుంటే చాలు ఆ సినిమా దాదాపు హిట్టే అన్న సెంటిమెంట్ బెడిసికొట్టింది.  సాధారణంగా అన్ని వర్గాల, అన్ని భాషల ప్రజలకు  పోలీస్ స్టోరీలంటే చాలా ఇష్టం. ఈ విషయం గతంలో అనేక సందర్భాలలో రుజువైంది. కనిపించని నాలుగో సింహం పవరే వేరు. ఇక అభిమానులకైతే తమ హీరో పోలీస్ అధికారిగా గన్ పట్టుకొని విలన్స్ను కాల్చేస్తుంటే ఆ ఉత్సాహం చెప్పనలవికాదు. మూస చిత్రాలు, కలగలుపు కథలతో రూపొందే మూవీలతో సిల్వర్ స్క్రీన్పై పోలీస్ యూనిఫాం పవర్ మసకబారింది.

ఎనర్జిటిక్ హీరో, మాస్ మహారాజ్ రవితేజ పోలీస్ డ్రెస్ వేస్తే ఆ కిక్కే వేరు. ఈసారి అన్ లిమిటెడ్ పవర్ చూపించడానికి మళ్లీ మాస్ పోలీస్గా  ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఐతే, విక్రమార్కుడు, బలుపు సినిమాలను మిక్స్ చేసి బాబి డైరెక్ట్ చేసిన 'పవర్' మూవీ పోలీస్ పవర్ని పూర్తిగా చూపించలేకపోయిందని అంటున్నారు. మెయిన్ స్టోరీలైన్ పక్కదారి పట్టిందని టాక్. మాస్ రాజా తన ఎనర్జీని చూపించాడు కానీ, పవర్లో కొత్త వెలుగులు మిస్సయ్యాయని సగటు ప్రేక్షకుడు ఫీలవుతున్నాడు

అప్పటిదాగా అల్లరి చిల్లర పాత్రలతో సూపర్ హిట్స్ కొట్టిన రవితేజ రాజమౌళి డైరెక్ట్ చేసిన విక్రమార్కుడు మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించి ట్రెమండస్ హిట్ అందుకున్నాడు. రాథోడ్ పాత్రలో అల్టిమేట్ పెర్ఫామెన్స్ చూపించాడు. పవర్ మూవీలో కూడా విక్రమార్కుడు రేంజ్లో అదరగొట్టాలని చూశాడు. బలదేవ్ సహాయ్ పాత్రలో బెంగాల్ టైగర్గా విలన్స్ని బెంబేలెత్తించాలని ట్రై చేశాడు. ఐతే, రొటీన్ యాక్షన్ సీన్స్, పవర్ లేని డైలాగ్స్ వల్ల ఆ క్యారెక్టర్కు రావాల్సిన ప్రాధాన్యత రాలేదని క్రిటిక్స్ అభిప్రాయం

పోకిరి, దూకుడు...ఈ రెండు సినిమాల్లోనూ మహేష్ పోలీస్ పొగరు చూపించాడు. పోకిరి బాక్సాఫీస్ రికార్డ్స్ను తిరగరాస్తే, దూకుడు ఎదురులేకుండా దూసుకుపోయింది. అదే పోలీస్ సెంటిమెంట్ను మహేష్ బాబు ఫాలో అయ్యాడు.  శ్రీనువైట్ల, మహేష్ కాంబినేషన్లో వచ్చింది ఆగడు. ప్రిన్స్ ముచ్చటగా మూడోసారి పోలీస్ డ్రెస్ వేశాడు. ఎప్పటిలాగే మహేష్ మళ్లీ వన్ మేన్ షో చేశాడు. సూపర్ స్టార్ విసిరిన నాన్ స్టాప్ పంచ్ డైలాగ్స్కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కానీ, ప్రేక్షకుల అసహనానికి గురవుతున్నారని కొన్ని సినిమా సమీక్షలు చెబుతున్నాయి.

మహేష్ బాబు సైలెంట్గా ఉంటూ పంచ్ డైలాగ్స్ పేలిస్తే కొన్ని సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. మహేష్ రూటు మార్చి ఊపిరి సలపకుండా డైలాగ్స్ చెప్పిన ఖలేజా ప్రేక్షకులకు మజా ఇవ్వలేదు. ఆగడు మూవీలో టైటిల్ కు తగ్గట్టే మహేష్ మాటలధాటి ఎక్కడా ఆగలేదు. పంచ్ల మీద పంచ్లతో మైండ్ బ్లాక్ చేశాడు ప్రిన్స్. అతడు తక్కువగా మాట్లాడితేనే ఎక్కువగా ఎక్కుతుంది. మహేష్ ఒక్కసారి డైలాగ్ చెబితే, వందసార్లు చెప్పినట్లే. అయితే  ఆగడులో వందసార్లు చెప్పేసరికి ఒక్కసారి కూడా ఎక్కలేదని విమర్శకుల అభిప్రాయం. సైలెంట్గా వైలెంట్ సృష్టించినట్లు మహేష్ తక్కువ డైలాగ్స్ పేలిపోయే భావం వ్యక్తం చేస్తేనే ప్రేక్షకులు ఇష్టపడతారని అర్ధమవుతోంది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement