‘‘డాకు మహారాజ్’లో యాక్షన్ సీన్స్ బాగుంటాయి. తెలుగుతోపాటు తమిళ్‌లోనూ ఈ నెల 12న మా సినిమాను రిలీజ్ చేస్తున్నాం. బాలకృష్ణగారి కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది’’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు. బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘డాకు మహారాజ్’. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి హీరోయిన్లుగా నటించగా, బాబీ డియోల్ కీలకపాత్ర చేశారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
మంగళవారం జరిగిన సమావేశంలో బాబీ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రం రాబోయే రోజుల్లో పలు సినిమాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని నమ్ముతున్నాను. యాక్షన్‌తోపాటు మంచి వినోదం, భావోద్వేగాలతో కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ నెల 12న నా బర్త్ డే కానుకగా ఈ చిత్ర విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’’ అని ప్రగ్యా జైస్వాల్ చెప్పారు. ‘‘ఈ సినిమా నా జర్నీలో ప్రత్యేకంగా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నాను’’ అన్నారు శ్రద్ధా శ్రీనాథ్.
Comments
Please login to add a commentAdd a comment