మళ్లీ బాబాయ్, అబ్బాయ్.. ఢీ! | Ntr Clash with bala krishna | Sakshi
Sakshi News home page

మళ్లీ బాబాయ్, అబ్బాయ్.. ఢీ!

Published Sat, Mar 25 2017 11:26 AM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

మళ్లీ బాబాయ్, అబ్బాయ్.. ఢీ! - Sakshi

మళ్లీ బాబాయ్, అబ్బాయ్.. ఢీ!

గత ఏడాది సంక్రాంతి నందమూరి ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోలు ముఖాముఖి తలపడ్డారు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన

గత ఏడాది సంక్రాంతి నందమూరి ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోలు ముఖాముఖి తలపడ్డారు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన నాన్నకు ప్రేమతో పాటు బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన డిక్టేటర్ సినిమాలో ఓకే సారి బరిలో దిగాయి. అయితే జూనియర్ కమర్షియల్ పెద్ద సక్సెస్ సాధించినా.. రెండు సినిమాలు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. సంక్రాంతి సీజన్లో అందరికీ సెలవులు ఉండటంతో ఆర్థికంగా రెండు సినిమాలకు పెద్దగా నష్టం జరగలేదు.

అయితే మరోసారి ఇలాంటి పరిస్థితే ఎదురయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. బాలయ్య హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అదే సమయంలో ఎన్టీఆర్ హీరోగా బాబీ తెరకెక్కిస్తున్న సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను ఆగస్ట్ లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా.. కాస్త ఆలస్యం అయ్యేలా ఉంది. అంటే సెప్టెంబర్కే రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో మరోసారి బాబాయ్, అబ్బాయ్లు తలపడటం కాయం అంటున్నారు ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement