వెంకటేశ్, పాయల్ రాజ్‌పుత్, నాగచైతన్య, రాశీఖన్నా, బాబీ, తమన్
‘‘మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో యూనిట్ అంతా ఎంతో కష్టపడటంతోనే ఇంత పెద్ద సక్సెస్‌ను అందుకున్నాం. ‘వెంకీమామ’ సినిమాను బాగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. చిరంజీవిగాకి, మహేశ్‌బాబుకి కూడా మా సినిమా నచ్చడంతో అభినందించారు.. ఇందుకు వారిద్దరికీ ధన్యవాదాలు’’ అని వెంకటేశ్ అన్నారు. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా, పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘వెంకీమామ’. డి.సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ నిరి్మంచిన ఈ సినిమా ఈ నెల 13న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన థ్యాంక్స్ మీట్‌లో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని టెన్షన్ గా ఉండేది. విడుదల తర్వాత చాలా సంతోషంగా ఉంది. అందరూ సినిమాను తమదిగా భావించి ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరు మామలు కలిసి కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో నాకు చూపించారు.
మాకే కాదు.. ఇది తాతగారి (రామానాయుడు) కల.. తాతగారి సక్సెస్. అందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘నా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూశాను. అంతా బాగా ఎంజాయ్ చేశారు’’ అన్నారు రాశీఖన్నా. ‘‘మనం రేపు మాట్లాడుకునే సినిమాల్లో ‘వెంకీమామ’ ఒకటిగా నిలుస్తుందని కచి్చతంగా చెప్పగలను’’ అన్నారు పాయల్ రాజ్‌పుత్. ‘‘ఈ సక్సెస్ రెండేళ్ల కష్టం. హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. నా జీవితంలో ఈ సినిమా చాలా ప్రత్యేకం. వెంకటేశ్‌గారు, చైతన్యగారి పాజిటివిటీ వల్లే ఈ సినిమా తీయగలిగాను’’ అన్నారు కె.ఎస్.రవీంద్ర. ‘‘మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. ‘‘వెంకటేశ్‌గారు, చైతన్యగారితో సినిమా అనగానే ఎగ్జయిట్ అయ్యి ‘వెంకీమామ’ చేశాను’’ అన్నారు సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్. ‘‘ఇంటి భోజనం తింటే ఎలా ఉంటుందో ‘వెంకీమామ’ చూస్తుంటే అలా అనిపించింది’’ అన్నారు డైరెక్టర్ నందినీ రెడ్డి. డైరెక్టర్ వంశీ పైడిపల్లి, చందూ మొండేటి, నిర్మాత వివేక్ కూచిభొట్ల, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment