Chiranjeevi-Ravi Teja: Mega 154 Movie Story Leak, Rumors Goes Viral - Sakshi
Sakshi News home page

Mega 154 Movie: చిరంజీవి సినిమాలో రవితేజ పాత్ర ఇదేనా.. స్టోరీ లీక్‌!

Published Wed, Jul 27 2022 12:35 PM | Last Updated on Wed, Jul 27 2022 3:11 PM

Chiranjeevi, Ravi Teja Mega 154 Movie Story Leak, Rumors Goes Viral - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 154వ చిత్రంలో మాస్‌ మహారాజా రవితేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌ నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల రవితేజ కూడా సెట్స్‌లోకి కూడా అడుగుపెట్టాడు. తాజాగా ఈ చిత్రంలో రవితేజ పోషించబోయే పాత్ర ఇదేనంటూ.. ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

(చదవండి: బొద్దుగా ఉండే అంజలి.. ఇలా అయిపోయిందేంటి?)

ఇందులో చిరంజీవి తమ్ముడిగా రవితేజ కనిపించబోతున్నాడట. సవతి తల్లి కొడుకైన రవితేజతో చిరంజీవికి వైర్యం ఏర్పడుతుదంట. ఇద్దరి పాత్రల మధ్య ఊహించని ట్విస్ట్‌లు ఉంటాయట. వీరిద్దరి మధ్య వచ్చే ఓ హైలోల్టేజ్‌ ఎపిసోడ్‌ సినిమాకే హైలెట్‌ అవుతుందని ప్రచారం జరుగుతోంది.

బయట కూడా చిరంజీవిని రవితేజ సొంత అన్నయ్యలా భావిస్తాడు. గతంలో వీరిద్దరు అన్నాదమ్ములుగా ‘అన్నయ్య’ చిత్రంలో నటించారు. మళ్లీ ఇప్పుడు కూడా మెగాస్టార్‌కు మాస్‌ మహారాజా తమ్ముడిగా నటిస్తున్నాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అనేది తెలియాల్సి ఉంది.  ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement