
ఎన్టీఆర్ ట్రిపుల్ ధమాకా..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ను రంజాన్ సందర్భంగా రిలీజ్ చేయాలని భావించారు. అయితే ఈ లోగా టీజర్ రఫ్ కట్ ఆన్లైన్లో లీక్ అవ్వటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్కు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చారు చిత్ర నిర్మాతలు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. అందుకే ఆ మూడు పాత్రలకు సంబంధించిన మూడు వేరు వేరు టీజర్లను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా జూలై 6 సాయంత్ర 5 గంటల 22 నిమిషాలకు జై పాత్రకు సంబంధించిన టీజర్ను రిలీజ్ చేస్తున్నారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రపై భారీ అంచనాలు ఉన్నాయి. మిగతా రెండు టీజర్లను త్వరలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Jai. Lava. Kusha. 3 Unique Characters that deserve their own unique teasers. You saw Jai. Now get ready for #JaiTeaser on July 6th at 5:22pm pic.twitter.com/MBLg1FL1oi
— NTR Arts (@NTRArtsOfficial) 1 July 2017