ఎన్టీఆర్ తరువాత బన్నీతో..! | Bobby movie with Allu Arjun after Jai Lava Kusa | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ తరువాత బన్నీతో..!

Published Mon, Aug 28 2017 3:51 PM | Last Updated on Sun, Sep 17 2017 6:03 PM

ఎన్టీఆర్ తరువాత బన్నీతో..!

ఎన్టీఆర్ తరువాత బన్నీతో..!

పవర్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన దర్శకుడు బాబీ తొలి సినిమాతోనే కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండో సినిమానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావటంతో బాబీ స్టార్ డైరెక్టర్ అవుతాడని భావించారు. అయితే పవన్ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సర్థార్ గబ్బర్ సింగ్ కు డిజాస్టర్ టాక్ రావటంతో సీన్ రివర్స్ అయ్యింది.

అయితే అందరిని ఆశ్చర్యపరుస్తూ ఎన్టీఆర్ హీరోగా సినిమా ఎనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు బాబీ. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా జై లవ కుశ సినిమా తెరకెక్కిస్తున్న ఈ యువ దర్శకుడు, మరో స్టార్ హీరోను లైన్ లో పెట్టాడన్న ప్రచారం జరుగుతోంది. జై లవ కుశ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు బాబీ. ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న బన్నీ.. జై లవ కుశ రిజల్ట్ చూసిన తరువాత బాబీ సినిమాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement