![Allu Arjun Cousin Viran Muttamsetty Mukhya Gamanika Movie Update - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/26/viran-muttamshetty.jpg.webp?itok=qUx9hcT7)
హీరో అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ముఖ్య గమనిక’. ఇందులో లావణ్య హీరోయిన్. సినిమాటోగ్రాఫర్ వేణు మురళీధర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రాజశేఖర్, సాయికృష్ణ నిర్మించారు. కిరణ్ వెన్న సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ‘ఆ కన్నుల చూపుల్లోన..’ అంటూ సాగే పాటని డైరెక్టర్ కేఎస్ రవీంద్ర (బాబీ) రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘బన్నీగారిని (అల్లు అర్జున్) ఎప్పుడు కలవడానికి వెళ్లినా విరాన్ కనిపించేవాడు.
అంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకుని వాళ్ల సహాయం తీసుకోకుండా వారి ఆశీస్సులు తీసుకుని సొంత గుర్తింపు కోసం స్వతంత్రంగా ప్రయత్నించడం సంతోషం’’ అన్నారు. ‘‘నేను పుట్టింది, పెరిగింది ఇండస్ట్రీలోనే. బాబీ అన్నలాంటి మంచి మనిషి ఇండస్ట్రీలో లేరు. ఎన్ని జన్మలు ఎత్తినా మీరు చేసిన సహకారం మర్చిపోను’’ అన్నారు విరాన్.
‘‘తప్పు చేయాలన్న ఆలోచన వచ్చి.. ఆ ఆలోచనని సరిదిద్దుకునే లోపే కొన్ని అనర్థాలు జరుగుతాయి.. ఆ నేపథ్యంలో తీసిన సినిమా ఇది’’ అన్నారు వేణు మురళీధర్. ‘‘మా బ్యానర్‌లో నిర్మించిన తొలి చిత్రం ‘ముఖ్య గమనిక’. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు రాజశేఖర్. కాగా విరాన్ ముత్తం శెట్టి గతంలో బతుకు బస్టాండ్ అనే సినిమా చేశాడు.
చదవండి: కొత్త వ్యాపారం మొదలుపెట్టిన మనోజ్- మౌనిక.. దేశం నలుమూలలా తిరిగి..
Comments
Please login to add a commentAdd a comment