పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్‌ | Sakshi
Sakshi News home page

పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్‌

Published Thu, Apr 25 2024 3:56 PM

Allu Arjun Song Pushpa Pushpa Gets A Release Date - Sakshi

అల్లు అర్జున్‌ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘పుష్ప–2 ది రూల్‌’. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి కొత్త అప్‌డేట్‌ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ‘పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్‌...’ అంటూ సాగే టైటిల్‌ సాంగ్‌ తొలి లిరికల్‌ వీడియో ్రపోమోను విడుదల చేశారు మేకర్స్‌. పూర్తి పాటని మే 1న రిలీజ్‌ చేయనున్నట్లు  చిత్రబృందం ప్రకటించింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్‌ తెరకెక్కించిన ‘పుష్ప: ది రైజ్‌’ (2021) పాన్‌ ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్‌ అయిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్‌. ఈ మూవీకి సీక్వెల్‌గా రూపొందుతోన్న ‘పుష్ప–2 ది రూల్‌’పై ఇటు ఇండస్ట్రీ, అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ నెల 8న అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ మూవీ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. సునీల్, ఫహాద్‌ ఫాజిల్, ధనుంజయ, అనసూయ భరద్వాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సీఈఓ: చెర్రీ. 

Advertisement
Advertisement