
బాలీవుడ్ హీరో సన్నీడియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ జాట్. ఈ చిత్రంతో టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. మైత్రీమూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. నేడు (ఏప్రిల్ 6) శ్రీరామనవమి కావడంతో జాట్ మూవీ నుంచి ఓ రామ శ్రీరామ పాట రిలీజ్ చేశారు. పవర్‌ఫుల్ మ్యూజిక్‌తో ఆకట్టుకుంటున్న ఈ పాటకు థమన్ సంగీతం అందించాడు. అద్వితీయ వొజ్జల, శృతి రంజని సాహిత్యం అందించగా ధనుంజయ్ సీపన, సాకేత్ కొమ్మజోస్యుల, సుమానస్ కసుల, సాత్విక్, వాగ్దేవి కుమార ఆలపించారు.