Mega154: Ravi Teja Joins Chiranjeevi And Bobby Movie Deets Inside - Sakshi
Sakshi News home page

Mega154: మెగాస్టార్‌తో మాస్‌ మహారాజా.. షేక్‌హ్యాండ్‌ ఇస్తూ స్వాగతం..వీడియో వైరల్‌

Published Sat, Jul 16 2022 6:12 PM | Last Updated on Sat, Jul 16 2022 7:28 PM

Mega154: Ravi Teja Joins Chiranjeevi And Bobby Movie - Sakshi

వరుస సినిమాలతో జెడ్‌ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాడు మెగాస్టార్‌ చిరంజీవి. గాడ్‌ఫాదర్‌, భోళా శంకర్‌ చిత్రాలతో పాటు బాబీ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు. మెగా 154 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో మాస్‌ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడనే విషయం తెలిసిందే. తాజాగా ఆయన షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ అధికారికంగా తెలియజేస్తూ.. ఓ స్పెషల్‌ వీడియోని విడుదల చేశారు. 

అందులో రవితేజ కారు దిగి నడుచుకుంటూ చిరంజీవి క్యారవాన్‌ దగ్గరకు వెళ్లాడు. ‘అన్నయ్యా..’అంటూ తలుపు కొట్టగా.. ‘హాయ్‌ బ్రదర్‌’అంటూ చిరు చేయి అందించాడు. వీరిద్దరు లోపలికి వెళ్లగానే బాబీ వచ్చి ‘మెగా మాస్‌ కాంబో మొదలైంది’అని చెప్పడంతో వీడియో ముగుస్తుంది.

 చిరంజీవి, రవితేజలు కలిసి అన్నయ్య చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత మళ్లీ వీరిద్దకు ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నాడు. ఒకవైపు మెగాస్టార్‌, మరోవైపు మాస్‌ మహారాజా.. ఇద్దరు కలిస్తే థియేటర్స్‌ దద్దరిల్లిపోవడం ఖాయం. మైత్రీమూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌ నటిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement