Megastar Waltair Veerayya Second Video Lyrical Song Out Today - Sakshi
Sakshi News home page

Waltair Veerayya: 'నువ్వు శ్రీదేవి అయితే.. ఆ అయితే..' ఏం లేదు.. సాంగ్ చూసేయండి..!

Published Mon, Dec 19 2022 4:07 PM | Last Updated on Mon, Dec 19 2022 5:06 PM

Megastar Waltair Veerayya Second Video Lyrical Song Out Today - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి బాబీ డైరెక్షన్‌లో నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. శ్రుతి హాసన్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో మాస్‌ మహారాజ రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే బాస్‌ పార్టీ పేరుతో తొలి సింగిల్ పాటను రిలీజ్‌ చేసిన చిత్రబృందం తాజాగా మరో పాటతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలోని రెండో సింగిల్ పాటను మేకర్స్ విడుదల చేశారు. 

ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ చిత్రంలోని సెకండ్‌ సింగిల్‌ పాట'నువ్వు శ్రీదేవి అయితే.. ఆ అయితే.. నేనే చిరంజీవి అవుతా.. రాయే రాయే రాయే చేసేద్దాం రబ్బో' అంటూ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను ఫ్రాన్స్‌లోని మంచుకొండల్లో కొద్ది రోజుల క్రితమే షూట్ చేశారు. ఇటీవలే ఈ పాట షూటింగ్‌ పూర్తి కావడంతో చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement