అన్న నిర్మాత...తమ్ముడు హీరో | NTR and Bobby New Movie Launch | Sakshi
Sakshi News home page

అన్న నిర్మాత...తమ్ముడు హీరో

Published Fri, Dec 9 2016 11:24 PM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM

అన్న నిర్మాత...తమ్ముడు హీరో

అన్న నిర్మాత...తమ్ముడు హీరో

తమ్ముడు చిన్న ఎన్టీఆర్‌ హీరోగా ఓ సినిమా నిర్మించాలనే ఆలోచన అన్నయ్య నందమూరి కల్యాణ్‌రామ్‌కి ఎప్పట్నుంచో ఉంది. అన్నదమ్ముల సినిమా అంటే అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ బోలెడు అంచనాలు ఏర్పడతాయి. ఈ విషయం చిన్న ఎన్టీఆర్‌–కల్యాణ్‌రామ్‌లకు బాగా తెలుసు. అందుకే, అంచనాలను చేరుకునే కథ కోసం ఇన్నాళ్లూ ఎదురుచూశారు. ఇప్పుడీ అన్నదమ్ములు ఇద్దరికీ నచ్చిన కథ సిద్ధమైంది. ‘జనతా గ్యారేజ్‌’ వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం కల్యాణ్‌రామ్‌ తమ్ముడితో తీయబోయే సినిమా వార్తను ప్రకటించారు. ‘పవర్‌’, ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రాల ఫేమ్‌ కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు.

‘మా సొంత నిర్మాణ సంస్థ యన్‌.టి.ఆర్‌. ఆర్ట్స్‌లో తమ్ముడు తారక్‌ హీరోగా చిత్రం నిర్మిస్తుండడం ఆనందంగా ఉంది. ఎన్టీఆర్‌లో నటుడికి, స్టార్‌కి న్యాయం చేసే కథను బాబీ చెప్పారు. రానున్న సంక్రాంతి తర్వాత పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని ప్రారంభించి, నాన్‌ స్టాప్‌గా షూటింగ్‌ జరుపుతాం. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని కల్యాణ్‌రామ్‌ తెలిపారు.కాగా, ఈ చిత్రంలో చిన్న ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తారని కృష్ణానగర్‌ ఖబర్‌. అయితే, ప్రచారంలో ఉన్నట్టు ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తారా, లేదా అన్నది కల్యాణ్‌రామ్‌ చెప్పలేదు. హీరోయిన్‌ సహా ఇతర వివరాలకు లెటజ్‌ వెయిట్‌ అండ్‌ సీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement