తెలుగు సినిమా షూటింగ్‌లో గాయపడ్డ హాట్ బ్యూటీ ఊర్వశి! | Urvashi Rautela Injury While Shooting For Balakrishna New Movie In Hyderabad, Deets Inside | Sakshi
Sakshi News home page

Urvashi Rautela Injury: గాయపడ్డ హీరోయిన్ ఊర్వశి రౌతేలా.. ఏమైంది?

Published Tue, Jul 9 2024 9:29 PM | Last Updated on Wed, Jul 10 2024 12:43 PM

Urvashi Rautela Injury While Shooting Balakrishna New Movie

హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా గాయపడింది. బాలీవుడ్‌లో ఇప్పటికే నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. గతంలో 'వాల్తేరు వీరయ్య' మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. ప్రస్తుతం అటు హిందీ, ఇటు తెలుగులో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం బాలకృష్ణ సినిమాలో కీలక పాత్ర చేస్తున్న ఈమెకు ఓ సీన్‌లో భాగంగా తీవ్రమైన గాయమైనట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: వంటలక్కకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? వీడియో వైరల్)

బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ మధ్యే హైదరాబాద్‌లో మొదలైంది. ఇందులో రీసెంట్‌గానే ఊర్వశి రౌతేలా జాయిన్ అయింది. తాజాగా ఈమెపై ఓ యాక్షన్ సీన్ తీస్తుండగా.. కాలికి ఫ్రాక్చర్ అయిందని, వెంటనే ఆస్పత్రిలో చేర్చినట్లు ఈమె టీమ్ చెప్పుకొచ్చింది. అయితే గాయంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

ఇకపోతే ఈ సినిమాలో బాలయ్యతో పాటు చాందిని చౌదరి, బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీపావళి కానుకగా థియేటర్లలో ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ పరిస్థితుల బట్టి రిలీజ్ డేట్ అటు ఇటు కావొచ్చని కూడా తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement