నందమూరి బాలకృష్ణ- యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో NBK 109 పేరుతో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆ ప్రాజెక్ట్ నుంచి బాలయ్య బర్త్‌డే గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ నుంచి నాగవంశీ, సౌజన్య ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు.
ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్ ఉన్నారు. గతేడాది మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రంతో డైరెక్టర్ బాబీ హిట్ కొట్టాడు. అందులో స్పెషల్ సాంగ్‌లో మెరిసిన ఊర్వశి రౌటేలాకు డైరెక్టర్ బాబీ మరో ఛాన్స్ ఇచ్చాడు. NBK 109 చిత్రంలో ఆమె కూడా ఒక స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది. చాందిని చౌదరి కూడా ఇందులో కీలక పాత్రలో నటిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment