బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 'డాకు మహారాజ్' నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శ్రద్ధాశ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చాందిని చౌదరి కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ మూవీలో విలన్‌గా కనిపించబోతున్నాడు. తాజాగా విడుదలైన 'డాకుస్ రేజ్' ప్రోమో అదిరిపోయింది. తమన్ అందించిన బీజీఎమ్‌కు ఎవరైనా ఫిదా కావాల్సిందే అనేలా ఈ సాంగ్ ఉండనుంది. ఈ సాంగ్‌కు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా నాకాశ్ అజీజ్ ఆలపించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా డాకు మహారాజ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.2025 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment