అత్యంత వృద్ధ శునకం ‘బాబి’ ఇకలేదు | Worlds oldest dog dies at age 31 | Sakshi
Sakshi News home page

అత్యంత వృద్ధ శునకం ‘బాబి’ ఇకలేదు

Published Wed, Oct 25 2023 1:45 PM | Last Updated on Wed, Oct 25 2023 3:18 PM

Worlds oldest dog dies at age 31 - Sakshi

లిస్బన్‌: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకంగా పేరున్న ‘బాబి’ 31 ఏళ్ల వయస్సులో శనివారం తుదిశ్వాస విడిచింది. పోర్చుగల్‌లోని కాన్‌క్వెయిరోస్‌ అనే ఊళ్లో 1992 మే 11న ఈ కుక్క పుట్టింది. అప్పటికి బాబి యజమాని లియోనల్‌ కోస్టా వయస్సు 8 ఏళ్లే. మంచి ఆహారం, స్వచ్చమైన గాలి, అమితమైన ప్రేమ..ఇవే బాబి ఇన్నేళ్లపాటు జీవించడానికి కారణాలని లియోనల్‌ చెప్పారు.  బాబి మొత్తం 31 సంవత్సరాల 165 రోజులపాటు జీవించినట్లు తెలిపింది. బాబి స్వచ్చమైన రఫీరో డో అలెంటెజో జాతికి చెందింది. ఈ జాతి శునకాల సగటు ఆయుర్దాయం 10 నుంచి 14 ఏళ్లు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement