మీకు నచ్చినట్టు బైక్ డిజైన్..!
భారత్‌కు బిగ్ డాగ్ మోటార్‌సైకిల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ మోటార్‌సైకిల్స్ తయారీలో ఉన్న అమెరికన్ బ్రాండ్ బిగ్ డాగ్ భారత్‌కు ఎంట్రీ ఇచ్చింది. కస్టమర్లు కోరిన విధంగా బైక్‌లను తయారు చేయడంలో ఈ సంస్థ ప్రపంచంలో అతిపెద్దది. ఒకే మోడల్ అరుునప్పటికీ ఒక బైక్‌కు మరో బైక్‌కు అసలు పోలిక ఉండదన్నమాట. బిగ్ మోటార్‌సైకిల్ కంపెనీ భారత్‌లో ఈ బైక్‌లను మార్కెట్ చేస్తోంది. 69 రకాల పెరుుంట్, గ్రాఫిక్స్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. కస్టమర్లు తమకు నచ్చిన ఇంజన్, రంగులు, గ్రాఫిక్స్, వీల్స్, సీటు, డ్రాగ్ పైప్స్, యాక్సెసరీస్, స్టోరేజ్ బ్యాగ్, గ్రిప్స్, విండ్‌షీల్డ్‌ను ఎంచుకోవచ్చని బిగ్ మోటార్‌సైకిల్ ఫౌండర్ సమర్ జేఎస్ సోధి వెల్లడించారు. ఏటా ఆరు బైక్‌లు విక్రరుుంచవచ్చనేది ఆయన అంచనా.
బైక్ ధర రూ.59 లక్షలు..క్ష్మ బిగ్ డాగ్ భారత్‌లో కే9 రెడ్ చాపర్-111 మోడల్‌తో అడుగు పెట్టింది. 1807 సీసీ 45 డిగ్రీ వి-ట్విన్ ఎస్అండ్ఎస్ సూపర్ స్లైడర్ ఇంజన్‌ను దీనికి పొందుపరిచారు. ఆరు గేర్లు, 14.4 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంకు, 115 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స వంటివి బైక్ ఫీచర్లు. సీటు ఎత్తు 24.5 అంగుళాలు. బైక్ పొడవు 108 అంగుళాలు. బరువు 475 కిలోలు. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో బైక్ ధర రూ.59 లక్షలు. ఆన్‌రోడ్ రూ.65 లక్షలు ఉండే అవకాశం ఉంది. బిగ్ డాగ్ నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 30,000లకుపైగా బైక్‌లు రోడ్డెక్కారుు.