
సాక్షి, సిర్పూర్ కాగజ్‌నగర్: ఇంకా ఎన్ని రోజులు మా పనులన్నీ వదులుకొని యూరియా కోసం లైన్‌లు కట్టాలి.. మా పంటలు ఏం కావాలని కొమురం భీం(ఆసిఫాబాద్) జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతును రైతలు నిలదీశారు. ఆయన సోమవారం యూరియా పరిస్థితిని పరిశీలించేందుకు కాగజ్‌నగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంలో రైతులు తమకు యూరియా అందే వరకు కదలనివ్వమని కలెక్టర్ వాహనం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు తమకు గత వారం రోజులుగా యూరియా అందటం లేదని.. తీవ్ర కొతరను ఎదుర్కొంటున్నామని తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదురుగా నిత్యం పడిగాపులు కాస్తున్నామని కలెక్టర్‌కు దృష్టికి తీసుకువచ్చారు. యూరియా నిల్వలు పెంచాలని రైతులు కలెక్టర్‌ను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment