చెన్నూర్ : నిన్న మొన్నటి వరకు మండల కేంద్రాల్లో రోజుకు 4 గంటల విద్యుత్ కోతలు ఉంటే మళ్లీ శనివారం నుంచి 6 గంటల విద్యుత్ కోతలు ఉంటాయని ట్రాన్స్ కో అధికారులు ప్రకటించారు. దీంతో వర్షాకాలంలో కూడా ప్రజలకు విద్యుత్ వెతలు తప్పడంలేదు. దీంతో ఇటు చిన్న వ్యాపారులు, అటు రైతులు, మరోవైపు గృహ వినియోగదారులు కరెంటు కష్టాలను ఎదుర్కొంటున్నారు.
వ్యాపారాలపై పిడుగు
ఇదివరకు మండల కేంద్రాల్లో ఉదయం 6 నుం చి 8 వరకు సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు కరెంటు కోతలు విధించారు. ఈ సమయాల్లో కోత విధించడంతో చిన్న వ్యాపారులకు కొంత వెసులుబాటు లభించింది. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు విద్యుత్ కోతలు విధిస్తుండడంతో వెల్డింగ్ షాపులు, జిరాక్స్ సెంటర్లు, ప్రింటింగ్ ప్రెస్, పిండి గిర్ని, టైర్ పంక్చర్ టైలరింగ్, కార్పెంటర్లు, సర్వీసింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న చిన్న వ్యాపారులు విలవిల్లాడుతున్నారు. షాపులు తెరిచే సమయంలో కరెంటు కోతలు ఉంటే తాము పనులు ఎలా చేసుకునేదని వ్యాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తీరని నష్టం
కరెంటు కోతలు ప్రారంభం నుంచి ప్రజలు, రై తులు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. రోజంతా కరెంటు ఉంటే రూ.300ల నుంచి రూ. 400ల వరకు గిట్టుబాటు అయ్యేది. రెండు నెలల ట్రాన్స్‌కో విధిస్తున్న కరెంటు కోత ల మూలంగా రోజుకు రూ.200 గిట్టుబాటు కావడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. మ ళ్లీ మరో రెండు గంటలు పెంచితే షాపుల అద్దె లు కట్టేందుకు కూడా తమ సంపాదన సరిపోదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడలేదని ఇష్ట్యారాజ్యంగా కరెంటు సరఫరా నిలిపివేయడంతో చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు.
మళ్లీ పెరిగిన విద్యుత్ కోతలు
Published Tue, Jul 8 2014 12:16 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement